- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని పలు జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి ఉత్తర కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ తీర పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో ఇవాళ దక్షిణ కోస్తాలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. శనివారం ఉత్తర కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు, దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడొచ్చని అధికారులు సూచించారు.
శుక్రవారం ఉదయం నుంచి ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో పంటలు చేతికి అందివచ్చే సమయం కావడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. తేలికపాటి జల్లులు అయితే సమస్య లేదని.. భారీ వర్షాలు పడితే ఇబ్బందులు తప్పవంటున్నారు. మరోవైపు తెలంగాణలో కూడా వానలు పడుతున్నాయి. గురువారం అర్ధరాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల రెండు రోజుల పాటూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా హెచ్చరించింది.