- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జడివానతో హైవేలు జల దిగ్బందం
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షంతో ప్రధాన రహదారులు, లోతటు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. పలుచోట్ల ఇళ్లు కూలిపోగా మరికొన్ని చోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. ఖమ్మం జిల్లాలో కారు కొట్టుకుపోతుండగా.. అందులో ఉన్న ఆరుగురిని స్థానికులు కాపాడారు. మంగళవారం మధ్యాహ్నం 12గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాన కుమ్మరిస్తుండటంతో పరిస్థితులు దిక్కుతోచని విధంగా మారాయి.
యాదాద్రి భువనగిరి జిల్లాలో కుంభవృష్టి కురుస్తోంది. దీంతో చౌటుప్పల్ మండలం ఎల్లగిరి వద్ద హైదరాబాద్- విజయవాడ హైవే మొత్తం స్తంభించిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 8 కిలోమీటర్లకు పైగా వాహనాలు నిలిచిపోయాయి అంటే పరిస్థితులే ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రోడ్డుపై నడుములోతు నీరు చేరడంతో బైక్‌లు, కార్లలో వెళ్లే వారు అవస్థలు పడుతున్నారు.
అటు… అతి భారీ వర్షం కారణంగా జనగామ చౌరస్తా నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. వాహనదారులు సూర్యాపేట రహదారి బైపాస్ ద్వారా వెళ్లాలని, అదేవిధంగా హైదరాబాద్ నుంచి జనగామకు వచ్చే వాహనదారులు నెల్లుట్ల బ్రిడ్జి వద్ద నుంచి సూర్యాపేట రోడ్డు మీదుగా జనగామకు చేరుకోవాలని జనగామ పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.