- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతుకు కన్నీరే మిగిల్చిన వరుణుడు
by Sridhar Babu |
X
దిశ,హుజురాబాద్: రైతుల ఆశలు మరోసారి ఆవిరయ్యాయి. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి చేతికి వచ్చిన పంట నేలపాలైంది. అకాల వర్షంతో రైతాంగానికి అపార నష్టం వాటిల్లింది. ఆరుగాలం శ్రమించిన రైతాంగానికి చివరికి కన్నీరే మిగిలింది. ఒక్కసారిగా అన్నదాత కుదేలైపోయాడు.
హుజురాబాద్ డివిజన్ ప్రాంతంలో రాత్రి భారీ వర్షానికి కోతకు వచ్చిన పంట నేలవాలింది. అకాల వర్షంతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో సుమారు 5వేల ఎకరాల్లోని పంట నేలపాలైనట్లు రైతు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. హుజురాబాద్ డివిజన్ లోని హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, శంకరపట్నం, సైదాపూర్ మండలాల్లో వరి పంటలు చాలా వరకు నేలకొరిగాయి. రోడ్లపై, వ్యవసాయ మార్కెట్లో పోసిన ధాన్యం, రైతులు కోసిన ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది.
Advertisement
Next Story