- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీకి భారీ వర్ష సూచన.. స్కూల్స్ బంద్
దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవల ఏపీలో భారీ వర్షాలు కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడిప్పుడే కాస్త వర్షాలు తగ్గాయి అనుకున్న వారికి వాతావరణ శాఖ షాకింగ్ న్యూస్ తెలిపింది. అండమాన్ తీరంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని కారణంగా ఏపీలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ అల్పపీడనం ప్రభావం చిత్తూరు, నెల్లూరు జిల్లాలో ఎక్కువగా ఉండనుంది. అక్కడ సుమారు 13 సె. మీ వర్షపాతం నమోదు కావొచ్చునని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తిరుపతి, చిత్తూరు, నెల్లూరులో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించిది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో విద్యాలయాలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అలాగే రాయలసీమ, దక్షిణ కోస్తాకు భారీ వర్షసూచన ఉందని, నెలాఖరు వరకు దక్షిణ కోస్తాంద్రలో భారీ వర్షాలు కురువనున్నాయిని పేర్కొంది.