తాలిపేరు గేట్లు ఎత్తివేత.. తరలివస్తున్న పర్యాటకులు

by Sridhar Babu |
తాలిపేరు గేట్లు ఎత్తివేత.. తరలివస్తున్న పర్యాటకులు
X

దిశ, భద్రాచలం: గత రెండ్రోజులుగా జోరుగా కురుస్తున్న వర్షాలకు తాలిపేరు ప్రాజెక్టుకి మళ్ళీ వరద తాకిడి పెరిగింది. ప్రాజెక్టుకు ఎగువన ఉన్న ఛత్తీస్‌గఢ్ అటవీప్రాంతంలోని వాగులు, వంకల నుంచి భారీగా వరద వస్తుండటంతో 12 గేట్లు ఎత్తి 14,148 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. 74 మీటర్ల సాగునీటి సామర్థ్యం కలిగిన డ్యామ్‌లో 72.50 మీటర్ల నీటిని నిల్వచేసి అదనపు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 10813 క్యూసెక్కులని తాలిపేరు డీఈఈ తిరుపతి తెలిపారు. వరద పెరిగితే మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంది.‌ వరినాట్ల నిమిత్తం ప్రాజెక్టు ప్రధాన కుడి, ఎడమ కాలువలకు నీటిని సరఫరా చేస్తున్నారు. జోరువానలో సైతం నిండుకుండలా జలకళ సంతరించుకున్న తాలిపేరు ప్రాజెక్టు చెంతకు పర్యాటకులు తరలివస్తున్నారు.

Advertisement

Next Story