కేసీఆర్ ప్రకటనతో పెరిగిన చికెన్ విక్రయాలు

by Shyam |   ( Updated:2020-03-29 00:42:48.0  )
కేసీఆర్ ప్రకటనతో పెరిగిన చికెన్ విక్రయాలు
X

దిశ, రంగారెడ్డి: చికెన్ తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని సీఎం కేసీఆర్ మొన్న ప్రెస్‌మీట్‌లో చెప్పడంతో రాష్ట్రవ్యాప్తంగా కొనుగోళ్లు అమాంతం పెరిగిపోయాయి. చికెన్, మటన్, గుడ్లు, చేపలు తిని ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలని సీఎం సూచించడంతో ఆదివారం విక్రయాలు ఓ రేంజ్‌కు చేరుకున్నాయి. దీంతో సాధారణ రోజుల్లో కంటే భారీగా విక్రయాలు జరుగుతుండటంతో వ్యాపారులు ధరలు పెంచి అమ్ముతున్నారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఫౌల్ట్రీ రంగం పుంజుకున్నట్లు అయ్యింది.

గత రెండువారాల నుంచి చికెన్ ధరలు భారీగా పడిపోవడంతో వ్యాపారులు కోళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. షాపుల్లో అయితే రూ.100కే మూడు కిలోల చొప్పున విక్రయించారు. ప్రజెంట్ లాక్‌డౌన్ నడుస్తునందున నిన్న, మొన్నటివరకు స్లోగా సాగిన అమ్మకాలు ఇవాళ హండ్రెడ్ స్పీడుతో దూసుకెళ్తున్నాయి. కిలో చికెన్‌ను వ్యాపారులు రూ.170 నుంచి 180 వరకు అమ్ముతున్నారు. ఇదివరకు కిలో మటన్‌ను రూ.450 నుంచి 550 వరకు అమ్మిన వ్యాపారులు ఇప్పుడు రూ.750 వరకు అమ్ముతున్న పరిస్థితులు కనపడుతున్నాయి. ఉదాహారణకు షాద్‌నగర్ పట్టణంలో సాధారణ రోజుల్లో చిన్న షాపులు ఉన్న వ్యాపారులు 30కిలోల వరకు అమ్మకాలు జరిపే వారు. కానీ కర్ఫ్యూతో 5 కిలోలు అమ్మిన పరిస్థితులు లేకుండా పోయాయి. ఇప్పుడు ప్రభుత్వ ప్రకటనతో చికెన్ వ్యాపారం పుంజుకోవడంతో వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చికెన్ తింటే కరోనా సోకదు: వైద్యులు

మటన్, చికెన్ తింటే కరోనా వైరస్ సోకుతుందనే ప్రచారం తప్పని వైద్యులు చెబుతున్నారు. బలహీనంగా ఉండే వారు మాంసహారం తీసుకుంటే పోషకాలు అందుతుందని సూచిస్తున్నారు. ఏ ఆహారమైనా బాగా ఉడికించి తింటే ఎలాంటి రోగాలు రావని పేర్కొంటున్నారు.

Tags: Corona Virus, Increased Chicken, Mutton Prices, Poultry Sector, CM KCR, Rangareddy, Shadnagar, Doctors

Advertisement

Next Story