నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. వైద్య,ఆరోగ్య శాఖలో భారీగా ఖాళీల భర్తీ..

by srinivas |   ( Updated:2021-11-25 08:47:27.0  )
alla nani
X

దిశ, ఏపీ బ్యూరో: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. త్వరలో వైద్య, ఆరోగ్యశాఖలో 14వేల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. అసెంబ్లీలో గురువారం వైద్యంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నాని మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక మెడికల్‌ కాలేజీ, నర్సింగ్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. ఇప్పటికే పలుచోట్ల కార్యరూపం దాల్చాయని వెల్లడించారు.

అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని చెప్పుకొచ్చారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మారనున్నట్లు తెలిపారు. విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌తో ప్రజల దగ్గరకే వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో వైద్యుల కొరత తీర్చడానికి చర్యలు చేపడుతున్నామని మంత్రి ఆళ్ల నాని అసెంబ్లీలో ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed