- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉత్తరాది రాష్ట్రాలకు ‘రెడ్ అలర్ట్’
న్యూఢిల్లీ : రానున్న రెండు రోజుల్లో వడగాలులు వీచే ప్రమాదమున్నదని, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఛండీగడ్, రాజస్తాన్‌లకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. తూర్పు యూపీలోనూ వేడిగాలులు వీచే అవకాశమున్నదని ఆ రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించింది. వచ్చే రెండు మూడు రోజుల్లో ఉత్తరాదిలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలను తాకవచ్చునని ఐఎండీ రీజినల్ సెంటర్ హెడ్ కులదీప్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ వేసవిలో ఢిల్లీ శనివారం అత్యధిక ఉష్ణోగ్రత(46 డిగ్రీలు)ను చవిచూసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర విదర్భ రీజియన్‌కు చెందిన నాగ్‌పూర్ సోనెగావ్‌లో ఆదివారం 46 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నమోదైంది. దీంతోపాటు బీహార్, జమ్ము కశ్మీర్, లడాఖ్, తూర్పు యూపీ, హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల ఒక్క రోజులోనే మూడు డిగ్రీలు పెరిగింది. పశ్చిమ బెంగాల్, అసోం, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గడ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, కేరళలోనూ ఉష్ణోగ్రతలు వేగంగా పెరిగాయని ఐఎండీ వివరించింది. ఛత్తీస్‌గడ్, ఒడిషా, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, మరాఠ్‌వాడా, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, యానాం, రాయలసీమ, కర్ణాటక ఉత్తరప్రాంతాల్లో వచ్చే మూడు నాలుగు రోజుల్లో వడగాలు వీచే అవకాశమున్నదని అంచనా వేసింది. అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, బెంగాల్‌లలో వచ్చే ఐదు రోజుల్లో తీవ్ర వర్షాపాతం నమోదయ్యే అవకాశముందని ఐఎండీ ఆదివారం తెలిపింది.
బెంగుళూరును ముంచెత్తుతున్న వర్షం
కర్ణాటక రాజధాని బెంగుళూరును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. శుక్రవారం నుంచి కురుస్తున్న వర్షాలతో నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. కొన్ని ఏరియాలలో రోడ్లు తెగిపోయాయి. చెట్లు వేర్ల నుంచి పెకిలించుకొచ్చాయి. ఈ వర్షాలు బెంగళూరులో ఈ నెల 31వరకూ(సోమవారం, మంగళవారం మినహా) కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. కాగా, నగరంలో ఉష్ణోగ్రత 36 డిగ్రీలుగా నమోదు కావొచ్చుని, అటుతర్వాత 34 డిగ్రీలకు పడిపోవచ్చును తెలిపింది.