Yoga: వ్యాఘ్రాసనం ఎలా వేయాలి?

by Sathputhe Rajesh |   ( Updated:2022-04-15 06:26:38.0  )
Yoga: వ్యాఘ్రాసనం ఎలా వేయాలి?
X

ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. తర్వాత రెండు చేతులను భూమి మీద ఆన్చాలి. అరచేతులు భుజాలకు, మోకాళ్లు నడుముకు సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు గాలి పీల్చుకుని ఎడమకాలిని వెనుకకు చాచి, మోకాలి దగ్గర మడవాలి. అలాగే ఎడమకాలు పైకి లేపి మడమను కుడి చేయితో పట్టుకోవాలి. ఎడమ తొడను వీలైనంత పైకి లేపుతూ మడమను తలకు దగ్గరగా తెచ్చేందుకు ప్రయత్నించాలి. ఆసనంలో సాధారణంగా శ్వాస తీసుకుంటూ.. ముందుకు చూస్తూ ఉండాలి. తర్వాత కుడి కాలుతో ఇదే పద్ధతిలో చేయాలి. మొత్తంగా 5 సెకన్లపాటు ఇదే స్థితిలో ఉండి యథాస్థితికి రావాలి. ఇలా ఒక్కో కాలుతో 5 సార్లు చేయాలి.

ఉపయోగాలు

* చేతులు, కాళ్ల కండరాలు దృఢంగా తయారవుతాయి.

* వెన్నెముకకు సంబంధించిన నరాలు ఉత్తేజితమవుతాయి.

* సయాటికా అదుపులోకి వస్తుంది.

* తొడలు, నడుముకు మంచి వ్యాయమం.

Advertisement

Next Story

Most Viewed