- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీరియడ్స్ కి ముందు మహిళల్లో శృంగార కోరికలు అందుకే పెరుగుతాయా..
దిశ, ఫీచర్స్ : ప్రతి నెల మహిళలు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య పీరియడ్స్. ఈ టైం వచ్చిందంటే చాలు చాలామంది మహిళలు చాలా ఇబ్బంది పడుతుంటారు. బయటికి వెళ్లేందుకు కూడా ఇష్టపడరు. ఇక కొంతమంది మహిళలు కడుపు నొప్పిని భరించలేక తెగ ఏడ్చేస్తారు. పీరియడ్స్ సమయంలో ఇలా ఒక్కొక్కరికి ఒక్కో ఇబ్బంది ఉంటుంది. అయితే చాలామంది మహిళలకు పీరియడ్స్ వచ్చే ముందు సెక్స్ కోరికలు ఎక్కువగా పెరుగుతాయట. ఇంతకీ దానికి గల కారణాలు ఏంటి, నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
స్త్రీ శరీరంలో నెల పొడవునా హార్మోన్లు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. దీని కారణంగా మహిళల మానసిక స్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకోవడం చాలా కష్టం. అయితే ఈ సమస్య PMS సమయంలో ఎక్కువగా కనిపిస్తుంది. పీరియడ్స్ వచ్చే ముందు స్త్రీల శరీరంలో, అలాగే వారి ప్రవర్తనలో కూడా చాలా మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా వివాహం అయిన కొంతమంది మహిళలకు పీరియడ్స్ కి ముందు తన భాగస్వామితో సెక్స్ చేయాలనే కోరిక ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
మహిళల్లో అండోత్సర్గము జరిగే ముందు స్త్రీ శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి గణనీయంగా పెరిగి వారిలో ఉద్రేకాన్ని పెంచుతుందని చెబుతున్నారు. అందుకే పీరియడ్స్ ముందు స్త్రీలలో సెక్స్ కోరికలు బలంగా ఉంటాయని చెబుతున్నారు. అలాగే పీరియడ్స్ సమయంలో మహిళల్లో సెక్స్ పట్ల కోరిక పెరగడానికి మరో కారణం కూడా ఉందట. నిజానికి పీరియడ్స్ సమయంలో మహిళలు గర్భం దాల్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ సమయంలో వారు స్వేచ్ఛగా సెక్స్ అనుభూతిని పొందాలనుకుంటారని చెబుతున్నారు.