- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బిర్యానీ తిన్న వారికే ఎందుకు ఎక్కువ దాహం వేస్తుంది..
దిశ, వెబ్‌డెస్క్ : బిర్యానీ.. ఈ పేరు వింటేనే నోట్లో లాలాజలం వస్తుంది. చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు బిర్యానీకి ప్రతి ఒక్కరూ ఫ్యాన్స్ ఉంటారు. ఏదైనా సందర్భం వచ్చిందంటే చాలు బిర్యానీ లవర్స్ రెస్టారెంట్‌కు వెళ్లి తినడమో లేక ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకోని ఓ పట్టుపట్టడమో చేస్తారు. ఆ తరువాత మొదలవుతుంది అసలు విషయం. అది ఏంటంటే బిర్యానీ తిన్నవారికి విపరీతంగా దాహం వేస్తుంది. ఆ దాహం తీర్చుకోవడానికి సోడాలు, కూల్ డ్రింక్స్, నీళ్లను తెగ తాగుతారు. అయినా చాలాసేపటివరకు అసలు దాహం తీరదు. అసలు బిర్యానీ తిన్న తరువాత ఎందుకంత దాహం వేస్తుంది..? దాని వెనక ఉన్న కారణం ఏంటో చాలా మందికి తెలిసి ఉండదు.
మానవ శరీరంలో సుమారుగా 70 శాతం వరకు నీరు ఉంటుంది. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడల్లా నీరు తాగుతుంటాం. ఎక్కువగా మూత్ర విసర్జన చేయడం, చెమట వేయడం ద్వారా శరీరంలోని నీరు బయటకు వెళ్లిపోతుంది. అలాంటప్పుడు శరీరం డీ హైడ్రేట్ అయినట్టు అనిపిస్తుంది. అప్పుడు ఖచ్చితంగా నీటిని తాగుతాం. అలాగే మనం తీసుకునే ఆహారంలో ఉండే కొన్ని వస్తువుల ద్వారా మానవునికి దాహం వేస్తుంది. ఎక్కువగా ఆయిల్ ఫుడ్, ఉప్పుశాతం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే దాహం ఎక్కువగా అవుతుంది. ఫుడ్‌లో ఉండే కొవ్వు కరిగిపోవడానికి చాలా సమయం పడుతుంది. శరరంలో ఆహారంతో వెళ్లిన ఉప్పుని బ్యాలెన్స్ చేయాలంటే శరీరం నీటిని ఎక్కువగా కోరుకుని అది డైజేషన్ అయ్యేదాకా దాహం వేస్తుంది. అందుకే వెజ్ బిర్యానీ లేదా నాన్ వెజ్ బిర్యానీ, అధికంగా ఆయిల్ ఫుడ్ తీసుకున్న వారికి దాహం ఎక్కువగా వేస్తుంది. మన శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండాలంటే పండ్లు, కూరగాయలు, సూప్‌లను ఎక్కువగా తీసుకోవాలి. ఈ పదార్థాల్లో సుమారుగా 90 శాతం నీరు ఉంటుంది. అందుకే నీటిశాతం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని ఫుడ్ ఎక్స్‌పర్ట్స్ చెబుతూ ఉంటారు.