మీ జుట్టు ఒత్తుగా పెరగాలా.. ఇలా చేయండి?

by samatah |   ( Updated:2023-02-14 04:31:18.0  )
మీ జుట్టు ఒత్తుగా పెరగాలా.. ఇలా చేయండి?
X

దిశ, వెబ్‌డెస్క్ : జుట్టు పొడవుగా ఉండాలని ఏ అమ్మాయి కోరుకోదు. చాలా మంది జుట్టు పొడవుగా అందంగా ఉండాలనుకుంటారు. కానీ ప్రస్తుతం జుట్టు త్వరగా ఊడిపోతుంది. దీంతో అమ్మాయిలందరూ ఆందోళన చెందుతూ ఏవేవో షాంపూస్, హేయిర్ ఆయిల్ వాడుతూ ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. అయితే అలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి మందార పువ్వు ఎంతగానో ఉపయోగపడుతుంది.

మందార పువ్వు‌లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.మందార పువ్వు రేకులు, ఆకులు జుట్టు సంబంధిత సమస్యలైన చుండ్రు, జుట్టురాలడం లాంటి సమస్యలకు చక్కటి పరిష్కారం. వారానికి రెండు సార్లు మందార నూనెను జుట్టుకు పట్టడం వలన జుట్టు ఒత్తుగా పొడవుగా నాజుగ్గా పెరుగుతుందంట. అంతే కాకుండా చుండ్రు కూడా ఈజీగా తగ్గుతుందంట. అయితే ఇలా జుట్టు ఒత్తుగా పెరగాలంటే.. పది మందారం ఆకులు, పూల రేకులను, పేస్టుల ా చేసుకొని, కొబ్బరినూనె వేడి చేసి ఆ నూనెలో ఈ పేస్ట్ వేసుకోవాలి. దాన్ని వారానికి రెండు సార్లు మసాజ్ చేసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి : ఉత్సాహంగా 'రన్ ఫర్ గర్ల్ చైల్డ్'

Advertisement

Next Story

Most Viewed