పిల్లల్లో థైరాయిడ్ ఉంటే కనిపించే లక్షణాలు ఇవే!

by Jakkula Samataha |
పిల్లల్లో థైరాయిడ్ ఉంటే కనిపించే లక్షణాలు ఇవే!
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చాలా మంది వేధిస్తున్న సమస్యల్లో థైరాయిడ్ ఒకటి. ఒకప్పుడు కాస్త వయసు పైబడిన వారిలో, మహిళల్లో మాత్రమే ఈ సమస్య కనిపించేది. కానీ ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు.పిల్లలను వేధించే దీర్ఘకాలిక వ్యాధులలో ఇదొక్కటి. కొంత మంది పిల్లలు తాము తీసుకునే ఆహారం లేదా గర్భంతో ఉన్న సమయంలో సరైన ఆహారం తీసుకోకపోవడం వలన చిన్నపిల్లలకు థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా,జన్యుపరమైన లోపాలు, పుట్టుకతో వచ్చే కొన్ని సమస్యల వలన పిల్లలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉన్న ఈ థైరాయిడ్ వ్యాధిని గుర్తించడంలో విఫలం అవుతున్నారు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పిల్లల్లో కనిపించే కొన్ని లక్షణాల ద్వారా మనం పిల్లలు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారో లేదో సులభంగా తెలుసుకోవచ్చునంట. కాగా, పిల్లలకు థైరాయిడ్ ఉంటే కనిపించే లక్షణాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

1. నీరసం, ఎప్పుడూ అసలిపోయినట్లు కనిపించడం, అనారోగ్య సమస్యలతో బాధపడటం.

2. శారీరక, మానసిక ఎదుగుదల లోపించడం.

3. జుట్టు ఎక్కువగా రావడం, ఎముకలు, దంతాలు బలహీనపడటం.

4.పిల్లల చర్మం పొడిబారడం, అజీర్ణం, గొంతు భాగంలో ఉబ్బినట్లుగా కనిపించడం, మలబద్ధకం

5. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, లావు పెరగడం లేదా తగ్గడం.

ఈ లక్షణాలు కనిపిస్తే తప్పకుండా తల్లిదండ్రులు తమ పిల్లలను వైద్యుడి వద్దకు తీసుకెళ్లి తగిన పరీక్షలు చేయించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.దీని వలన వ్యాధిని త్వరగా నయం చేసుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed