- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలా.. ఈ ఐదు డ్రింక్స్ తాగాల్సిందే!
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సీజన్‌లో అనేక వ్యాధులు వస్తుంటాయి. అందువలన వైద్యులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతుంటారు. ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తుంటారు. కాగా, వర్షాకాలంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే ఈ ఐదు రకాల హెల్త్ డ్రింక్స్ తప్పకుండా తీసుకోవాలంట. కాగా, అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం టీ : వర్షాకాలంలో అల్లం టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, శరీరం హైడ్రేట్‌గా ఉండేలా చేస్తుంది. అంతే కాకుండా ఈ సీజన్‌లో చాలా మంది దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వార అల్లం టీ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.
ఉసిరి డ్రింక్ : ఉసిరి ఆరోగ్యానికి శక్తిని ఇవ్వడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే వర్షాకాలంలో ఉసిరి రసం తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా, ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమెంటరీ లక్షణాలురక్తంలో షుగర్ లెవల్స్‌ను నియంత్రిస్తాయి. అలాగే వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి కాపాడుతాయి.
పసుపు పాలు : పుసుపు కలిపిన పాలు ప్రతి రోజూరాత్రి తాగడం చాలా మంచిది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగు పరచడమే కాకుండా సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి.
తులసి టీ : తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ టీని రోజూ ఉదయం వర్షాకాలంలో తీసుకోవడం వలన దగ్గు, జలుబు వంటి వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి.
దాల్చిన చెక్క టీ : వర్షాకాలంలో దాల్చిన చెక్క రసం, అందులో తేనె కలిపి తీసుకోవాలి. దీని వల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.