- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసలే వర్షాకాలం.. మీ కళ్ళలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
దిశ, ఫీచర్స్ : వర్షాకాలం అనగానే చాలామంది భయపడతారు. ఎందుకంటే ఈ సీజన్‌లో వ్యాధులు దండయాత్ర చేస్తుంటాయి. ఇక ఈ వర్షాకాలంలో గాలిలో తేమ స్థాయిలు గణనీయంగా పెరిగిపోతాయి. దీని వలన అలెర్జీ, ఇన్ ఫెక్షన్స్, దగ్గు, జ్వరం వంటి అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అందువలన వైద్యులు ఈ సీజన్‌లో మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని, ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు. ఇక ఈ సీజన్‌లో దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులు రావడం చాలా కామన్. కానీ ఈ సీజన్ కంటిపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో కంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. కండ్లకలక, స్టై, ఫంగల్ కంటి ఇన్ఫెక్షన్స్, కార్నియల్ అల్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కళ్ల విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పెరిగిన తేమ, అప్పుడప్పుడు వర్షం నీరు మన కంటిలోకి వెళ్లడం వలన ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంట. అందువలన కంటిని శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా, క్రమం తప్పకుండా చేతులు కడగటం, పదే పదే కళ్లను రుద్దడం వంటివి అస్సలే చేయకూడదు అని వారు చెబుతున్నారు. కాగా, కంటికి సంబంధించిన వ్యాధుల లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. కండ్లకలక : వర్షాకాలంలో చాలా మంది వేధించే కంటి సమస్యల్లో కండ్లకలక ఒకటి. ఇది ఈ సీజన్‌లో సర్వ సాధారణం. ఇది ఒక అంటువ్యాధి. దీని వలన కన్ను ఎర్రగా మారడం, నీరు కారడం, నొప్పి వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ వ్యాధి సాధారణంగా 14 రోజుల వరకు ఉండవచ్చ. ఈ వ్యాధి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
జాగ్రత్తలు : పరిశుభ్రత పాటించాలి. పదే పదే కళ్లను తాకకూడదు. స్టెరాయిడ్ యాంటీబయోటిక్ కంటి చుక్కలను వాడకూడదు. ఇది కంటికి ప్రమాదకరం. ఈ వ్యాధి వచ్చిన వారు బహిరంగంగా ఉండటం, స్విమ్మింగ్ పూల్స్ సందర్శించడం, ఎక్కువ మంది గుంపులుగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకూడదు.
2. కార్నియల్ అల్సర్ : కార్నియల్ అల్సర్ అనేది కార్నియాకు వచ్చే ఇన్ఫెక్షన్. ఈ సీజన్‌లో ఇది ఎక్కువగా రావచ్చును. ముఖ్యంగా వ్యవసాయ పనులు చేస్తున్న వారికి ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. అకస్మాత్తుగా కంటి నొప్పి, కన్ను ఎర్రగా మారడం, నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పై లక్షణాలు ఏ మాత్రం కనిపించినా వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.
3. అలెర్జీ : దుమ్ము, మేకప్ కిట్, వాతావరణ మార్పులు, కాంటాక్ట్ లెన్స్ ధరించే వారు అలెర్జీ బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ సమస్య రాకూడదు అంటే తప్పని సరిగా సన్ గ్లాసెస్ ధరించాలి. అది దుమ్ము మన కంటిలో చేరకుండా కాపాడుతుంది. ఓవర్ ది కౌంటర్ స్టెరాయిడ్ కంటి చుక్కలు అస్సలే వాడకూడదు. ఇది దృష్టిలో మార్పులను తీసుకొచ్చే ప్రమాదం ఉంది. కండ్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. క్రమంగా కంటి నుంచి నీరు కారడం, ఎరుపు రంగు, దురదగా అనిపిస్తే ఈ వ్యాధి ఉన్నట్లే. పై లక్షణాలు కనిపిస్తే పలు జాగ్రత్తలు తీసుకోవాలి. యాంటిహిస్టామైన్ కంటి చుక్కలను వాడాలి. దీని ద్వారా అలెర్జీ సమస్య నుంచి బయటపడవచ్చు. సన్ గ్లాసెస్ వాడటం, మంచి ఆహారం, విటమిన్ ఏ, సీ ఉన్న ఫుడ్ తీసుకోవడం చేయాలి. దీని వలన కండ్ల పనితీరు బాగుంటుంది.
వర్షాకాలంలో కళ్ళ గురించి తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలు :
1.కంటి ఇన్ఫెక్షన్స్ రావడానికి ప్రధాన కారణం ఏవైనా ఉన్నాయా అంటే మన చేతి వేళ్లు, గోర్లు. కాబట్టి తప్పకుండా పదే పదే చేతులను వాష్ చేసుకోవాలి. చేతులు శుభ్రం చేసుకోకుండా, కళ్లను తాకకూడదు.
2.కళ్ళు దురదగా ఉన్నప్పుడు చేతులతో వాటిని రుద్దడం చేయకూడదు. కళ్ళ నుంచి పదే పదే నీరు వస్తూ అవి ఎర్రగా మారుతుంటే, మనం తాగే వాటర్‌తో కళ్లను శుభ్రం చేసుకోవాలి. లేకపోతే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
3. వర్షంలో బయటకు వెళ్లినప్పుడు కళ్ళజోడు లేదా సన్ గ్లాసెస్ ధరించడం మంచిది. వీటి ద్వారా గాలి, వర్షం నీరు, దుమ్మ కళ్ళలోకి రాకుండా ఉంటుంది.
4. మీ కళ్ళు దురదగా ఉంటే, రి కళ్ళు ఎర్రగా లేదా ఏదైనా ఇతర కంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నట్లయితే, కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల టవల్‌ను ఉపయోగించకూడదు.
5.వర్షాకాలంలో కళ్లు పొడిబారకుండా ఉండాలి అంటే ఐ మేకప్‌కు దూరంగా ఉండాలి.
(నోట్ : పైవార్త నిపుణులు, ఇంటర్నెట్‌లోని సమాచారం మేరకు ఇవ్వబడినది, దిశ దీనిని ధృవీకరించలేదు)