- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ ఆకులు తిన్నారంటే కొలెస్ట్రాల్ - డయాబెటిస్ పరార్..
దిశ, ఫీచర్స్ : మన చుట్టూ ఎన్నో రకాల చెట్లు, మొక్కలు ఉంటాయి. ఈ చెట్లు, మొక్కల ఆకులు, పువ్వులు, పండ్లు ఆహారంతో సహా అనేక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. చాలా వరకు ఆకులను జంతువులకు మేతగా వేస్తుంటారు. అనేక ఔషధ గుణాలు కలిగిన కొన్ని ఆకులు అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగపడతాయి. వాటిని సరిగ్గా ఎలా ఉపయోగించాలో కాస్త తెలుసుకుంటే చాలు. మరి ఆ ఆకులు ఏవో, ఎలా వాడాలో తెలుసుకుందాం.
బే ఆకు
ఈ ఆకు ఆహార రుచిని పెంచుతుంది. అంతే కాదు గుండెని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. కడుపు నొప్పిని తగ్గించి, మలబద్ధకాన్ని తొలగిస్తుంది. అలాగే డయేరియా నుండి ఉపశమనం కలిగిస్తుంది. మధుమేహానికి కూడా ఈ ఆకులు ప్రయోజనకరంగా ఉంటాయి.
కరివేపాకు..
ఈ ఆకు ఆహారానికి మంచి సువాసన ఇవ్వడమే కాకుండా, గ్లూకోజ్‌ను నియంత్రిస్తుంది. ఐరన్ పుష్కలంగా ఉండే ఈ ఆకు రక్తహీనతను తొలగిస్తుంది. అలాగే హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. రక్తహీనతతో బాధపడుతున్నట్లయితే ఈ ఆకులను తీసుకోవడం చాలా ముఖ్యం.
కొత్తిమీర ఆకులు..
కొత్తిమీర వంట రుచిని, వాసనను మెరుగుపరచడమే కాకుండా విటమిన్లు A, C, E లను కూడా అందిస్తుంది. కొత్తిమీర తినడం వలన కంటి చూపును మెరుగుపడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. రక్త కణాలను ప్రభావవంతంగా చేస్తుంది. అలాగే రక్తాన్ని పెంచడానికి దోహదపడుతుంది.
మెంతి ఆకులు..
చాలామంది మెంతి ఆకు కూరను తినేందుకు ఇష్టపడరు. కానీ ఇది గుండెపోటుకు కారణమయ్యే కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మధుమేహాన్ని తగ్గిస్తుంది. అలాగే ఇన్సులిన్ స్రావాన్ని పెంచుతుంది. అంతే కాదు రక్తం గడ్డకట్టడాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
గమనిక : ఈ కథనం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏదైనా ఔషధం లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం మీ వైద్యుడిని సంప్రదించండి.