Sunitha Williams : భూమిపైకి చేరుకున్న సునీతా విలియమ్స్.. అన్ని అనారోగ్య సమస్యలా.. నడక కూడా నేర్చుకోవాల్సిందేనా?

by Sujitha Rachapalli |   ( Updated:19 March 2025 3:52 AM  )
Sunitha Williams : భూమిపైకి చేరుకున్న సునీతా విలియమ్స్.. అన్ని అనారోగ్య సమస్యలా.. నడక కూడా నేర్చుకోవాల్సిందేనా?
X

దిశ, ఫీచర్స్: తొమ్మిది నెలల అంతరిక్ష ప్రయాణం అనంతరం ఇవాళ సునీతా విలియమ్స్ భూమిపై ల్యాండ్ అయ్యారు. కానీ, తిరిగి ఇంటికి రావడం ప్లేన్ బోర్డింగ్ అంత సులభం కాదు. గురుత్వాకర్షణతో యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇన్నాళ్లు అక్కడున్న స్పేస్ మిషన్ మనిషి శరీరంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. మైక్రోగ్రావిటీలో ఆస్ట్రోనాట్స్ ఎమకల సాంద్రత కోల్పోవడం, కండరాల క్షీణత, దృష్టి లోపం సమస్యలు, కార్డియోవాస్క్యులర్ స్ట్రెస్ ఏర్పడుతాయి. రేడియేషన్ ఎక్స్‌పోజర్‌తో క్యాన్సర్, ఐసోలేషన్‌తో మెంటల్ హెల్త్‌పై ఎఫెక్ట్ పడుతుంది. ఇన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న తరువాత ఆమె భూమి మీదకు తిరిగిరావడం.. ముఖ్యంగా గురుత్వాకర్షణకు లోనవడం అంటే మళ్లీ బ్యాలెన్సింగ్, కో-ఆర్డినేషన్, అంతెందుకు నడక కూడా కొత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది. దీనిపై నాసా మాజీ వ్యోమగామి లెరాయ్ చియావో స్పందన తెలుసుకుందాం.

* సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి తిరిగి వచ్చినప్పుడు నడవడంలో ఇబ్బంది పడవచ్చు. ఎందుకంటే అంతరిక్షంలో ఎక్కువసేపు నడవడం వల్ల వ్యోమగాములకు ‘బేబీ ఫీట్’ డెవలప్ అవుతాయి.

* గాలి, గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల వ్యోమగాములు అంతరిక్షంలో బరువులేనితనాన్ని (Weightlessness) అనుభవిస్తారు. దీంతో పాదాలపై కాలిస్ మాయమవుతుంది. బేసిక్‌గా చర్మపు మందపాటి భాగాన్ని కోల్పోతారు.

* ఎక్కువసేపు అంతరిక్షంలో ఉన్నప్పుడు గురుత్వాకర్షణకు గురికాకపోవడం వల్ల కోలుకోలేని ఎముక సాంద్రత నష్టం జరుగుతుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. అంతరిక్షంలో గడిపిన వ్యోమగాముల బరువు మోసే ఎముకలు ప్రతి నెలకు ఒక శాతం పెళుసుగా మారుతాయని నాసా వెల్లడించింది.

Read More..

వారంలో మానాల్సిన గాయం.. కేవలం 4 గంటల్లో మానేలా జెల్! శాస్త్రవేత్తల అద్భుత సృష్టి

Next Story