- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చికెన్ లివర్‌ను అవాయిడ్ చేస్తున్నారా .. అయితే ఇది తెలుసుకోండి..
దిశ, వెబ్‌డెస్క్ : చాలా మంది న్యూట్రిషనల్ ఫుడ్ అయిన మేక లివర్ తినేందుకు ఇష్టపడుతుంటారు కానీ చికెన్ లివర్‌ను అవాయిడ్ చేస్తుంటారు. అయితే ఇందులో కూడా మేకతో సమానమైన న్యూట్రిషనల్ వాల్యూ కలిగి ఉందని చెబుతున్నారు న్యూట్రిషనిస్టులు. విటమిన్ ఎ, విటమిన్ బి, ఐరన్, కాల్షియమ్, ఫైబర్ కలిగిన చికెన్ లివర్.. డయాబెటిస్‌ను అదుపులో ఉంచడంతో పాటు బ్రెయిన్ డెవలప్‌మెంట్, కంటిచూపు పెరిగేందుకు ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు.
ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ :
* చికెన్ లివర్‌లోని సెలీనియం.. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా, ఇన్ఫెక్షన్లు, కీళ్ల నొప్పులు, నులిపురుగుల సమస్యలను నియంత్రించడంలో ఉపయోగకరంగా ఉంటుంది.
* ఇందులోని జింక్.. జ్వరం, టాన్సిలిటిస్, జలుబు, దగ్గుకు కారణమయ్యే సూక్ష్మక్రిములకు వ్యతిరేకంగా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. * * ఇక కొల్లాజెన్, ఎలాస్టిన్‌లు మన శరీరంలోని సిరల్లో రక్తప్రసరణను నార్మల్‌గా ఉంచుతాయి.
* చికెన్ కాలేయం ప్రోటీన్ మూలం. ఇది ఎముక, కండరాల నిర్మాణాన్ని బలపరుస్తుంది. శరీరంలోని వివిధ పోషకాహార లోప సమస్యలను అధిగమించేందుకు, వేగంగా బరువు పెరగేందుకు సాయపడుతుంది.
* కాలేయంలోని ఫోలేట్ అనే పదార్థం లైంగిక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అడ్రినలిన్ హార్మోన్ స్రవాన్ని పెంచుతుంది.
* శరీరంలో రక్తహీనత లక్షణాలు ఉంటే చికెన్ కాలేయం ఉపయోగకరంగా ఉంటుంది. విటమిన్ బి12, ఐరన్ అధికంగా కలిగిన చికెన్ కాలేయం రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది.
*అయితే, అధిక రక్తపోటు లేదా గుండె సమస్యలు ఉన్నవారు చికెన్ లివర్ తినకుండా ఉండటం మంచిది. గర్భధారణ సమయంలో ఎక్కువగా తీసుకోకూడదు. ఇందులో ఉండే విటమిన్ ఎ పిల్లలకి హాని కలిగిస్తుంది.