గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నివసిస్తే క్యాన్సర్ వస్తుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు ?

by Disha Web Desk 20 |
గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నివసిస్తే క్యాన్సర్ వస్తుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు ?
X

దిశ, ఫీచర్స్ : ఒకప్పటి కాలంలోని మనుషులు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. కాలం మారుతున్నాకొద్ది, మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యల్లో ఎక్కువగా ఎదురయ్యే సమస్య క్యాన్సర్. ఈ మధ్యకాలంలో ఆడ, మగ, చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలామంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. శరీరంలోని ఏ భాగానికైన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. నిజానికి ఈ మహమ్మారి ఎక్కువగా వంశపారంపర్యంగా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆల్కాహల్, సిగరెట్లు ఎక్కువగా తీసుకునే వారికి ఈ వ్యాధి వస్తుందంటున్నారు. వీటితో పాటు మరో కొత్త కారణంతో కూడా క్యాన్సర్ వస్తుందంటున్నారు వైద్యనిపుణులు. ఇంతకీ ఆ కారణం ఏంటి ఎలా వస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం.

మానవ శరీరంలోని కణాలు ఒక క్రమ పద్దతిలో విభజన జరుగుతాయి. అయితే కొన్ని సార్లు ఈ కణాల నియంత్రణ తగ్గిపోయి వేగంగా కణవిభజన జరుగుతుంది. ఆ తర్వాత కణాలు కొన్ని సమూహాలుగా మారి క్యాన్సర్ వస్తుంది. అంతే కాదు మితిమీరిన తొబాకో వాడకం, సిగరెట్‌, కెమికల్ కార్సినోజెన్సీల కారణంగా క్యాన్సర్ సంభవించే ప్రమాదాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే వారికి కూడా క్యాన్సర్ వస్తుందంటున్నారు నిపుణులు. వింటుంటే ఆశ్చర్యంగా ఉన్న అది నిజం అంటున్నారు నిపుణులు. అపార్ట్మెంట్ లో ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ నివసించడం అంత మంచిది కాందంటున్నారు. ఎందుకంటే భూమి లోపల నుంచి రేడాన్ వాయువు విడుదలై అవి పీల్చడం వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయట.

నేలపై ఏమైనా పగుళ్లు ఉన్నా.. ఇండ్ల నిర్మాణం సమయంలో ప్లాస్టింగ్ సరిగా చేయకున్నా అందులో ఈ రేడాన్ గ్యాస్ వెళ్తుంది. ఆ విషయం తెలియకుండానే దాన్ని పీల్చుతూ ఉంటారు. దీనిలో ఉండే కార్సినోజెన్సీ ప్రభావంతో చాలమంది క్యాన్సర్ మహమ్మారి బారిన పడతుంటారని వైద్యులు చెబుతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలతో ఈ సమస్య నుంచి బయటపడొచ్చంటున్నారు నిపుణులు. దాదాపుగా ఇంట్లో ఎక్కువగా వెంటిలేషన్ ఉండేలా చూడాలి. అలా ఉండడం వలన రేడాన్ గ్యాస్ ఇంట్లోకి వచ్చినా అది బయటికి వెళ్లి గాలిలో కలిసిపోతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ ని మానేస్తే క్యాన్సర్ బారి నుంచి తప్పించుకోవచ్చు. అలాగే బయటికి వెల్లేటప్పుడు, బ్రిక్స్ పనులు, సిమెంట్ పనులు చేసేచోట తప్పనిసరి మాస్క్ ధరించాలి.

Next Story

Most Viewed