మోషన్ ఫ్రీ లేదా.. ఈ లక్షణాలు కనిపిస్తే క్యాన్సర్ ఉన్నట్లే?

by Jakkula Samataha |
మోషన్ ఫ్రీ లేదా.. ఈ లక్షణాలు కనిపిస్తే క్యాన్సర్ ఉన్నట్లే?
X

దిశ, ఫీచర్స్ : ఇప్పుడు చాలా మందిని బాధపెడుతున్న సమస్య మలబద్ధకం. మోషన్ ఫ్రీలేకపోతే నాకు ఏదో అనారోగ్య సమస్య తలెత్తింది అని చాలా మంది భయాందోళనకు గురి అవుతుంటారు.ఇంకొంత మంది అది పెద్దపేగు క్యాన్సరేమో అని భయపడిపోతుంటారు.

అయితే ఈ క్యాన్సర్ భారిన పడినవారి లక్షణాలు ఇలా ఉంటాయంట.పెద్ద పేగు క్యాన్సర్ ఉన్నవారికి కనిపించే ప్రధాన లక్షణం మలద్వారం నుంచి రక్తస్రావం అవుతూ ఉంటుంది. కొద్దిరోజులు విపరీతమైన మలబద్దకంగా ఉంటుంది, మరికొన్ని రోజులు విరేచనాలు అవుతూ ఉంటాయి. మలం వదులుగా అవుతూ ఉంటుంది. పొట్ట కింది నొప్పి, పట్టేసినట్లుగా ఉండటం, గ్యాస్ వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పురీషనాళం నుంచి లేత ఎరుపు రక్తస్రావం, రక్తం కారణంగా మలం ముదురు రంగులో ఉంటాయి. మల విసర్జన చేస్తున్నప్పుడు నొప్పిగా అనిపించడం. బలహీనత, అలసట, అకారణంగా బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మేలు. ఇవి ఏవీ లేకుండా ఓన్లీ మలబద్ధకం ఉంటే మాత్రం ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదరంట.

Advertisement

Next Story

Most Viewed