- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆల్‌బుఖారా పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలెన్నో!
దిశ, ఫీచర్స్: సీజనల్ పండ్లలో ఆల్‌బుఖారా ముఖ్యమైనవి. ఇవి వర్షాకాలంలో మార్కెట్‌లో అందుబాటులోకి వస్తాయి. ఎరుపు రంగులో ఉండి.. నిగ నిగ లాడుతూ నోట్లో నీరు ఊరేలా చేస్తాయి. అయితే ఇవి కాస్త పుల్ల పుల్లగా ఉన్నప్పటికీ చాలామంది ఈ పండు ఇష్టంగా తింటుంటారు. అలాగే వర్షాకాలం సీజన్ పోయేంతవరకు చిన్నా పెద్దా ఆల్ బుఖారాతో పలు వెరైటీస్ రెడీ చేసుకుని లాగించేస్తారు.
అయితే ఈ పండ్లకు కొందరు తినడానికి కూడా ఇష్టపడరు. కానీ దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. ఈ పండ్లలో ఫైబర్, విటమిన్స్, పొటాషియం, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఉండి పలు అనారోగ్య సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
* ఈ పండ్లలో ఉండే ఫైబర్ కంటెంట్, మలబద్దకాన్ని తగ్గిస్తుంది. అలాగే జీవక్రియకు సహాయపడడం తో పాటుగా, పేగు ఆరోగ్యానికి మేలు కలిగించి పలు అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి.
* ఆల్ బుఖారా పండ్లు ఆంథోసైనిక్స్ అనే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి క్యాన్సర్ కణాలు ఉత్తత్తి చెందకుండా చేస్తాయి. అలాగే పలు రకాల క్యాన్సర్ల నుంచి రక్షిస్తాయి. ఇందులోని పొటాషియం రక్తపోటు రాకుండా చేస్తుంది.
* ఆల్ బుఖారా పండ్లలో ఉండే విటమిన్లు కంటిచూపు మెరుగుపరచడంతో పాటుగా రోగనిరోధక శక్తిని పెంచి వర్షాకాలంలో వచ్చే సీజనల్ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.
*ప్రస్తుతం ఉన్న బిజీ బిజీ లైఫ్‌లో వర్క్, ఇంట్లో సమస్యల వల్ల ఒత్తిడి గురవుతుంటారు. దీంతో నిత్యం ఏదో ఆలోచిస్తూ చిన్న దానికి టెన్షన్ పడిపోతుంటారు. అలాగే ఎలా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే ఈ పండ్లు క్లోరోజెనిక్ యాసిడ్స్, యాంజియోలైటిక్ లక్షణాలు ఉండటం వల్ల ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తాయి. కాబట్టి ఆల్ బుఖారనే డైట్‌లో చేర్చుకోవడం మంచిది.
* ముఖ్యంగా రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఆల్ బుఖారా పండ్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది.
* గత కొద్ది కాలంగా గుండె జబ్బులతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది గుండె ఆరోగ్యంగా ఉండాలని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ హార్ట్ ఎటాక్‌తో చూస్తుండగానే చనిపోతున్నారు. అయితే ఆల్ బుఖారా పండ్లను తినడం వల్ల గుండె జబ్బులు దూరమవడంతో పాటుగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
* ఆల్ బుఖారా పండ్లు ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా చాలా మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల ముడతలు తగ్గడంతో పాటు, చర్మం కాంతివంతంగా మారుతుంది. అలాగే మొటిమలు, మచ్చలు ఏమైనా ఉన్నా తొలగిపోయి మిల మిల మెరిసిపోతారు.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ఇది పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. దీనిని ‘దిశ’ దృవీంకరించదు.
- Tags
- health tips