కొబ్బరి బోండంలోని లేత కొబ్బరి తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

by Hamsa |
కొబ్బరి బోండంలోని లేత కొబ్బరి తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: వేసవి వచ్చిందంటే చాలు చాలా మంది కొబ్బరి బోండాల నీటితో తమ దాహాన్ని తీర్చుకుంటారు. నిత్యం కొబ్బరి నీళ్లను తాగడానికి ఇష్టపడుతుంటారు. కొబ్బరి నీటితో చాలా ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. అయితే కొంతమంది కొబ్బరి బోండం లోని నీటిని మాత్రమే తాగి అందులో ఉండే కొబ్బరిని తినకుండా పాడేస్తుంటారు. అలా చేయకుండా అందులో ఉండే లేత కొబ్బరిని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని న్యూట్రిషనిస్ట్ నమామి అగర్వాల్ తెలిపింది. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.

*లేత కొబ్బరిలో కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వు, ఫైబర్ ఉండి రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.

* అధిక బరువుతో బాధపడేవారు లేత కొబ్బరిని తింటే తొందరగా బరువు తగ్గి అందంగా కనిపిస్తారు.

* ఇందులో పాలీఫెనాల్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండి శరీరంలోని కణాలను దెబ్బతినకుండా కాపాడుతాయి.

*అంతే కాదు లేత కొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఉంటాయి కాబట్టి అవి మన శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి ఫలితాన్ని కలిగిస్తాయి.

*ఇక లేత కొబ్బరికాయలో కార్బోహైడ్రేట్స్ తక్కువ మొత్తంలో ఉంటాయి. కనుక అన్ని వయసుల వారు దీన్ని తినడం వల్ల సులభంగా అరిగిపోవడంతో అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

Advertisement

Next Story

Most Viewed