స్పెర్మ్‌ని ఎక్కువ సేపు స్కలనం కాకుండా నిరోధిస్తున్నారా.. ఈ సమస్యలు తప్పవు..

by Sumithra |   ( Updated:2024-03-24 10:38:46.0  )
స్పెర్మ్‌ని ఎక్కువ సేపు స్కలనం కాకుండా నిరోధిస్తున్నారా.. ఈ సమస్యలు తప్పవు..
X

దిశ, ఫీచర్స్ : చాలామంది పురుషుల్లో శృంగార కోరికలు ఎక్కువగా ఉంటాయన్నది తెలిసిన విషయమే. అయితే వీరు తమ భాగస్వామితో ఎక్కువ సేపు శృంగారం చేసి భావప్రాప్తిని పొందాలనుకుంటారు. అలాచేసేందుకు పురుషులు శృంగారంలో పార్టిసిపేట్ చేసి క్లైమాక్స్‌కు చేరుకునే సమయానికి స్కలనాన్ని అడ్డుకుంటారు. భావప్రాప్తిని తీవ్రతరం చేయడానికి ఇది ఒక టెక్నిక్‌గా భావిస్తారు. అయితే చాలా కాలం పాటు ఇలా చేయడం ద్వారా ఆరోగ్యంపై తీవ్రమైన పరిణామాలు పడతాయంటున్నారు సెక్సాలజిస్టులు. మరి ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

తక్కువ స్పెర్మ్ కౌంట్..

పురుషుల సంతానోత్పత్తి వారి స్పెర్మ్ కౌంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ కాలం పాటు స్కలనాన్ని అడ్డుకుంటే వారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందంటున్నారు నిపుణులు. అందుకే ఉద్రేకానికి గురైనప్పుడు వీర్యం బయటకు రాకుండా ఆపకూడదని హెచ్చరిస్తున్నారు. అందుకే కొంతమందిలో గర్భం ధరించే ప్రయత్నాలు చేస్తున్నా మళ్లీ మళ్లీ విఫలమవుతాయని చెబుతున్నారు.

పురుషాంగంలో నొప్పి..

ఉద్రేకానికి గురైతే పురుషాంగంలో టెన్షన్ ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఎక్కువ సేపు స్కలనం కాకపోతే పురుషాంగంలో నొప్పి మొదలవుతుందంటున్నారు నిపుణులు. కొన్ని సందర్భాల్లో అది భరించలేని నొప్పిగా కూడా మారవచ్చని చెబుతున్నారు.

మూత్రపిండాల పై ప్రభావం..

ఒక వ్యక్తి స్పెర్మ్ విడుదలను ఆపడానికి ప్రయత్నించినప్పుడు, అది అతని మూత్రపిండాల పై కూడా ఒత్తిడిని కలిగిస్తుందని చెబుతున్నారు. అంతే కాదు ఇలా చేయడం వల్ల కిడ్నీ వాపు వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story