Heart attack: వర్షాకాలంలో గుండెపోటు వచ్చే ఛాన్స్ ఎక్కువంట!

by Jakkula Samataha |
Heart attack:  వర్షాకాలంలో గుండెపోటు వచ్చే ఛాన్స్ ఎక్కువంట!
X

దిశ, ఫీచర్స్ : వర్షాకాలంలో అంటు వ్యాధులే కాకుండా గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వర్షాకాలంలో వాతావరణంలో అధిక తేమ ఉంటుంది. ఇది దగ్గు, జలుబు, జ్వరం, అలెర్జీలకు కారణం అవుతుంది. అయితే శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి ఈ సీజన్‌లో గుండె పోటు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంట. అమెరికన్ హార్ట్ అసోషియేషన్ చేసిన ఓ పరిశోధనలో వర్షాకాలంలో అధిక తేమ వలన గుండె జబ్బుల వలన కలిగే మరణాల సంఖ్య మూడు రేట్లు అధికంగా ఉన్నట్లు తేలిందని వారు తెలిపారు. ఈ సీజన్‌లో ఉష్ణోగ్రత పెరగడం, తేమ అధికంగా పెరగడం వలన గుండె పోటు ప్రమాదాన్ని పెంచుతోందంట.

ఈ సీజన్‌లో అలెర్జీ, అంటువ్యాధులు చాలా వేగంగా ప్రభలుతాయి. అయితే వర్షాకాలంలోని తేమ గుండెజబ్బులు ఉన్నవారికి చాలా హానికరం , ఇది చిన్న పిల్లలు, వృద్ధులలో రోగనిరోధక శక్తిని బలహీనపరిచి, ఇన్ఫెక్షన్స్ బారిన పడేలా చేస్తుందంట. అందువలన ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. అందువలన పరిశుభ్రత విషయంలో చాలా కేరింగ్ తీసుకోవాలంట. మన ఇంట్లో తేమ శాతాన్ని తగ్గించుకోవడం, ఇంటిని శుభ్రంగా ఉంచడం లాంటిది చేయాలంట. దీని వలన తేమకు దూరంగా ఉండటం వలన ఆరోగ్యం కూడా బాగుంటుంది.( నోట్ : పైవార్త నిపుణులు, ఇంటర్నెట్ సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది. దిశ దీనిని ధృవీకరించలేదు)



Next Story