- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిన్నారి ప్రాణాలు తీసిన ‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా’..పిల్లల్లో వచ్చే ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలేంటి?
దిశ,వెబ్డెస్క్: ఇటీవల చాలా రకాల బ్యాక్టీరియాలు చిన్న పిల్లలపై అటాక్ చేస్తున్నాయి. ఈ బ్యాక్టీరియాల వల్ల చాలా మంది పిల్లలు మృత్యువాతపడుతున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే కేరళలో చోటుచేసుకుంది. ప్రాణాంతకమైన బ్యాక్టీరియాల వల్ల ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. బ్యాక్టీరియా వర్గానికి చెందిన ఒక రకమైన అమీబాతో ఈ వ్యాధి వస్తుంది. కలుషితమైన నీటిలో ఉండే ఈ జీవి నోరు, ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి, మెదడును పని చేయకుండా చేస్తుంది. అందుకే దీనిని మెదడును తినే అమీబా గా పిలుస్తారు. ఈ వ్యాధి బారిన పడిన వారిలో తొలుత తీవ్ర జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కేరళలో 2017, 2023 లోనూ ఈ కేసులు వెలుగుచూశాయి.
వివరాల్లోకి వెళితే.. ‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా’తో కేరళలో ఓ బాలిక చనిపోయింది. ఈ నెల 1, 10 వ తేదీల్లో కుటుంబ సభ్యులతో కలిసి బాలిక చెరువులో స్నానానికి వెళ్లింది. కొన్ని రోజుల తర్వాత అస్వస్థతకు గురై మృతి చెందింది. ఆమె శరీరంలోకి ఫ్రీ లివింగ్ అమీబా ముక్కుగుండా ప్రవేశించి, మెదడుపై తీవ్ర ప్రభావం చూపినట్లు వైద్యులు తెలిపారు. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించకపోవడం, వైద్య చికిత్స ఆలస్యమవడం వల్ల ఆ బాలిక చనిపోయినట్లు వెల్లడించారు.