- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతి సంవత్సరం 24 మిలియన్ల మందికి పిచ్చిపడుతుందన్న wHO.. కీలక విషయాలు వెల్లడి!
దిశ, ఫీచర్స్ : ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక విషయాలను వెల్లడించింది. ప్రతి ఏటా 24 మిలియన్ల మందికి పిచ్చిపడుతుందని పేర్కొంది. తాజాగా చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్లు తెలిపింది. చాలా మంది స్కిజోఫ్రెనియా అనే వ్యాధి బారిన పడుతున్నారంట. ఇది ఓ మానసిక ఆరోగ్య రుగ్మత. సరిగ్గా చెప్పాలంటే పిచ్చి పట్టడం. అంటే వారు ఏం చేస్తున్నారో కూడా వారికి తెలియకుండా వింత గా ప్రవర్తించడం. ఈ వ్యాధి అనేది సుమారు 24 మిలియన్ల మందిని ప్రభావితం చేసిదంని, ముఖ్యంగా దీని ప్రభావం మహిళలకంటే ఎక్కువగా పురుషులపై ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఈ డిసీజ్ అనేది జీవితాన్ని ఇబ్బందుల్లో పడేస్తుంది. ఈ వ్యాధి రావడానికి ప్రధాన కారణం, మొదడులోని రసాయన అసమతుల్యత, ముఖ్యంగా డోపమైన్ పెరుగుదల. దీని వలన మానసిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ డోపమైన్ నరాల కణాల మధ్య సందేశాలను ప్రచారం చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇది ఏవైనా బలమైన కారణాలు, సమస్యలు, ఇబ్బందులు, సంఘర్షణలతో కూడిన జీవితం, ఒత్తిడి, అనుకున్న పని చేయలేక పోయాను అనే ఒత్తిడి లాంటి సమస్యల వలన ఈ పదార్థం లో తేడా వస్తుంది. దీంతో స్కిజోఫ్రెనియా అనే వ్యాధి ప్రబలుతుంది. ఈ వ్యాధి సోకిన వారు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అయితే దీని లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం :
తనతో తాను మాట్లాడుకోవడం, భయం, చిలిపి పనులు చేయడం, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం
కారణం లేకుండా ఏడవడం, నవ్వడం, పరుగులు తీయడం, తనను తానే కొట్టుకోవడం.
దీనిపై ఆసక్తి లేకుండా ఉండటం. ఏ పని చేయాలనిపించకపోవడం.
కనిపించని వ్యక్తితో మాట్లాడటం, అద్దంలో చూసుకొని చిలిపి పనులు చేయడం.