మజ్జిగతో ఆరోగ్యం

by sudharani |
మజ్జిగతో ఆరోగ్యం
X

దిశ,వెబ్ డెస్క్: వేసవిలో మనం ఎక్కువగా బయటతిరిగి వస్తాం. ఆ సమయంలో అలసటకి లోనవుతాము. అయితే అప్పుడు మనం గ్లాస్ మజ్జిగ తీసుకుంటే అది మనకు ఎంతో శక్తిని ఇస్తుంది. అంతే కాకుండా అలసట నుంచి విముక్తి చేస్తుంది. ఇక మజ్జిగ మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలిస్తే షాక్ అవుతారు. వేసవిలో డీహైడ్రేషన్ వంటి సమస్యలకు మజ్జిగ చక్కగా పనిచేస్తుంది. దాహాన్ని తీర్చడం, పేగులను శుభ్రపరచడం, శరీరంలోని కొన్ని విషాలను తొలగించడం, బరువుని తగ్గించడంలో మజ్జిగ ఎంతో ఉపయోగపడుతుంది. అజీర్ణం, మలబద్దకంతో బాధపడే వారికి మజ్జిగ ఒక మంచి మందులా పని చేస్తుంది. కడుపులో పుళ్ళు రాకుండాఎసిడిటి సమస్య తలెత్తకుండా మజ్జిగ ఔషదంలా పనిచేస్తుంది.

Advertisement

Next Story

Most Viewed