- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాత్రి 7 తర్వాత భోజనం చేస్తున్నారా ?.. అయితే ఈ నిజం తెలిస్తే షాకవుతారు
దిశ, వెబ్ డెస్క్: చాలామంది ప్రతిరోజూ రాత్రి 7 గంటల తర్వాత భోజనం చేస్తుంటారు. ఇంకొందరైతే రాత్రి 10 లేదా 11 గంటలకు భోజనం చేస్తుంటారు. అయితే, ఇలా భోజనం చేసేవారికి ఈ విషయం తెలిస్తే షాకవుతారు. పలు సమస్యలకు కారణం ఎప్పుడుపడితే అప్పుడు భోజనం చేయడమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.
చాలామంది రాత్రి 7 గంటల తర్వాత భోజనం చేస్తుంటారు. కానీ, ఆ విధంగా భోజనం చేయడం వల్ల పెద్ద సమస్య ఎదురవుతదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘ఎప్పుడుపడితే అప్పుడు మనం ఆహారం తీసుకుంటే అది త్వరగా అరగదు. మనం నిద్రపోయిన సమయంలో మన బాడీలోని అన్ని అవయవాలు కూడా రెస్ట్ తీసుకోవాలి. కానీ, మనం తీసుకున్న ఆహారం అరగడానికి చాలా సమయం తీసుకోవడం వల్ల కొన్ని అవయవాలు కంటిన్యూగా పనిచేయాల్సి వస్తోంది. దీంతో వాటికి రెస్ట్ అన్నదే ఉండదు. ఈ కారణంగా మనం సుఖమైన నిద్రపొందలేము. దీని కారణంగా చాలా సమస్యలు మనలో ఎదురవుతాయి’ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటలలోపు ఆహారం తీసుకోవాలని, అది కూడా పండ్లు గానీ, చపాతి గానీ తీసుకుంటే చాలా బెట్టర్ అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా తీసుకోవడం వల్ల అది త్వరగా అరిగి మన బాడీలోని ప్రతి అవయవం రెస్ట్ తీసుకునే అవకాశముంది.. దీని కారణంగా మనం సుఖమైన నిద్రను పొందుతామని వారు చెబుతున్నారు. అంతేకాదు.. ఇలా చేస్తే ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు మనకు మెలుకువ వచ్చే అవకాశం ఉందని, ఆ తర్వాత ప్రతిరోజూ మైండ్ చక్కగా పనిచేస్తదని, ఆ రోజంతా కూడా మనం ఉల్లాసంగా.. ఆరోగ్యంగా ఉంటామని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.