- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రతీ పోలీస్‌కు హెల్త్ ప్రొఫైల్ : డీజీపీ
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ప్రతీ పోలీస్అధికారికి ప్రత్యేకంగా హెల్త్ ప్రొఫైల్రూపొందించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. కొవిడ్‌నుంచి పోలీసులను కాపాడుకునేందుకు ప్రతి కమిషనరేట్, ఎస్పీ కార్యాలయాల్లో హెల్త్ మానిటరింగ్ కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని వివిధ విభాగాలు, రేంజ్ ఐజీ, డీఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో బుధవారం డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ అధికారుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని, ప్రతీ విభాగంలో కొవిడ్పాజిటివ్ వచ్చిన వారితో ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు రూపొందించామని పేర్కొన్నారు. ఈ వాట్సాప్ లలో పాజిటివ్ పెషెంట్లకు ఆత్మస్తైర్యం కలిగే విధంగా ఎప్పటికప్పుడు తగు సలహాలు సూచనలను అందించడంతో పాటు వైద్యులతో వైద్యసలహాలు అందించాలని స్పష్టం చేశారు. పాజిటివ్ వచ్చిన వారితో జూమ్ సమావేశాలను నిర్వహించి, వారిలో మానసిక స్టైర్యం కలిపించాలని కోరారు. ప్రతీ ఒక్కరికీ కొవిడ్ మెడికల్ కిట్ లతో పాటు బలవర్దక మైన డ్రై ఫ్రూట్స్ కూడా అందించాలని ఆదేశించారు.
డీజీపీ కార్యాలయం స్థాయిలోనూ ప్రత్యేకంగా హెల్త్ మానిటరింగ్ వాట్సాప్ గ్రూప్ ను తయారుచేసి, నిరంతరం పర్యవేక్షించునున్నట్టు తెలిపారు. హోమ్ గార్డ్ ఆఫీసర్ల ఆరోగ్య పరిరక్షణకూ ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు ఏడీజీ హోమ్ గార్డ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీ జితేందర్, హోమ్ గార్డ్స్ ఏడీజీ బాల నాగాదేవి, డీఐజీ సుమతి పాల్గొన్నారు.