కోవిడ్-19పై వదంతులు నమ్మొద్దు..

by sudharani |
కోవిడ్-19పై వదంతులు నమ్మొద్దు..
X

దిశ, హైదరాబాద్
తెలంగాణలో కోవిడ్-19పై ప్రజలు ఆందోళన చెందవద్దని వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన..కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉందని, ఇప్పటికే అన్నిరకాల చర్యలు చేపట్టినట్టు వివరించారు. దుబాయ్, ఇటలీ నుంచి వచ్చిన వారికి మాత్రమే ఈ వైరస్ సోకిందని, నగర వాసులకు కరోనా లక్షణాలు ఉన్నట్టు సామాజిక మాద్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని రాష్ట్ర ప్రజలకు సూచించారు.దీనిపై ఎప్పటికప్పుడు వైద్యులతో సమీక్షిస్తున్నామని, ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అదే విధంగా కరోనా అనుమానితుల కోఠి కమిషనర్ అండ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. కరోనా పాజిటివ్ అనుకున్న 47 మందికి టెస్ట్ చేయగా 45మందికి నెగెటివ్ రాగా వారిని ఇంటికి పంపించినట్టు తెలిపారు. మిగతా 2టెస్ట్‌లపై స్పష్టత రావాలన్నారు. ఎప్పుడైనా కరోనా పాజిటివ్ కేసులను కేంద్ర ప్రభుత్వం నిర్దారించాకే ప్రకటిస్తామని, కానీ మీడియా తొందపాటుగా ప్రచారం చేయవద్దని హితవు పలికారు. తొలిసారి వైరస్ సోకిన వ్యక్తి ఇళ్లు ఉన్నచోటు మహేంద్రాహిల్స్‌లో ముందస్తు చర్యలు చేపట్టామన్నారు.వారి కుటుంబ సభ్యలకు పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చిందన్నారు.వైరస్ దాటికి హైదరాబాద్ ఐటీరంగం ఖాళీ అవుతున్నట్టు వస్తున్నవార్తలను ఆయన ఖండించారు.వైరస్ సోకిన వ్యక్తి పక్కన ఉంటే కరోనా రాదని, వైరస్ ఉన్నవ్యక్తి తుమ్మినా, దగ్గినా ఆ తుంపరాలు నేరుగా ఇతరుల నోటిలో లేదా కంటిలో పడితేనే వ్యాపిస్తుందని పేర్కొన్నారు. కోవిడ్-19 పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్రంలోని పెద్ద ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమతులు ఇచ్చామని, ఐసోలేషన్ వార్డులు ఉన్నఆస్పత్రుల్లో చికిత్స పొందేందుకు అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఎవరైనా వైరస్ లక్షణాలతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరితే పరీక్షల కోసం ఆ నమూనాను గాంధీకి పంపాలని మంత్ర తేల్చి చెప్పారు.

కరోనా కంటే ప్రాణాంతక వైరస్‌లు ఉన్నాయని, సకాలంలో వ్యాధి లక్షణాలను గుర్తిస్తే దీనిని అదుపు చేయవచ్చునని మంత్రి ఈటల రాష్ట్ర ప్రజలకు భరోసానిచ్చారు.

TAGS :covid-19, minister etela rajender, press meet, virus affected only foreign people

Advertisement

Next Story

Most Viewed