తెలంగాణలో సెకండ్ వేవ్ ఉండకపోవచ్చు

by Shyam |
తెలంగాణలో సెకండ్ వేవ్ ఉండకపోవచ్చు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా సెకండ్ వేవ్‌పై తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైటెక్స్‌లో జరిగిన ‘రీ ఓపెనింగ్‌ ఆఫ్‌ స్కూల్స్‌ కాన్సె‌ప్ట్’పై జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ… కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉండకపోవచ్చని అన్నారు. రాష్ట్ర ఓ వైద్యారోగ్య శాఖ పూర్తి సన్నద్ధతతో ఉందని, ప్రతి రోజు 50 వేల మందికి కొవిడ్‌-19 పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. బడులను తిరిగి ప్రారంభించే విషయంలో త్వరలోనే సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

Advertisement

Next Story