- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజురాబాద్ బై పోల్.. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు
దిశ, జమ్మికుంట : రాష్ట్రంలో ఇప్పటివరకు 1.5 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు పబ్లిక్, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత కొద్ది నెలలుగా జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి కొవిడ్ చికిత్స కేంద్రంగా కొనసాగుతుండగా, ఇక నుండి ఈ ఆస్పత్రిలో అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా అదుపులో ఉన్నప్పటికీ హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల నేపథ్యంలో అక్కడక్కడా కొవిడ్ కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వ్యాక్సినేషన్ కొనసాగుతుందని, దీనిని మరింత ముమ్మరంగా నిర్వహించాలని వైద్యులను ఆదేశించారు. మొదటి, రెండో డోసులను అందిస్తున్నామన్నారు. అర్హులైన వారు, వ్యాక్సినేషన్ తీసుకోని వారు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట వైద్య, విద్యా సంచాలకులు రమేష్ రెడ్డి, సీఎం ఓఎస్‌డీ గంగాధర్, జిల్లా వైద్య అధికారిణి జవేరియా, ఉప వైద్యాధికారిణి స్వాతి, జమ్మికుంట ఆసుపత్రి సూపరింటెండెంట్ సుమన్, వైద్యాధికారి తులసీదాస్ ఉన్నారు.