- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండో డోస్‌పై విముఖత.. ఎందుకిలా చేస్తున్నారు..?
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వ్యాక్సినేషన్ తొలి డోస్‌కు ఉత్సాహం చూపిన హెల్త్ కేర్ వర్కర్లు రెండో డోస్ తీసుకోడానికి మాత్రం ముఖం చాటేశారు. రెండో డోస్ ఇచ్చే ప్రక్రియ ఈ నెల 13వ తేదీ నుంచి మొదలైంది. గత నెలలో మొదటి మూడు రోజుల పాటు తొలి డోస్ తీసుకున్నవారిలో కేవలం 37.5% మంది మాత్రమే రెండో డోస్ తీసుకున్నారు. తొలి డోస్ తీసుకున్న తర్వాత ముగ్గురు మరణించడం, పలువురు అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరడం లాంటి కారణాలతో రెండో డోస్ తీసుకోడానికి సాహసించడం లేదు.
రెండో డోస్ తీసుకోకపోతే వ్యాక్సిన్ పనిచేయదని, భవిష్యత్తులో కరోనా బారిన పడే అవకాశం ఉందని వైద్యాధికారులు అర్థం చేయిస్తున్నారు. గత నెలలో హెల్త్ కేర్ వర్కర్లలో మొదటి మూడు రోజుల్లో 70 వేల మందికి పైగా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకుంటే ఇప్పుడు మాత్రం రెండో డోస్‌ను 53 వేల మంది మాత్రమే తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో సగటున 10 శాతం కంటే తక్కువ మందే రెండో డోస్ తీసుకోడానికి సిద్ధపడ్డారు. దేశవ్యాప్తంగా సుమారు 1.7 లక్షల మంది రెండో డోస్ తీసుకున్నట్లు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.