దిశ ఎఫెక్ట్: దన్నుర్ లో హెల్త్ క్యాంప్ ఏర్పాటు

by Anukaran |
దిశ ఎఫెక్ట్: దన్నుర్ లో హెల్త్ క్యాంప్ ఏర్పాటు
X

దిశ, బోథ్ : మండల వ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న డెంగ్యూ కేసులు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బోథ్ మండలంలోని దన్నుర్ గ్రామానికి చెందిన నిమ్మల లావణ్య మృతి చెందింది. అయితే దీనిపై ‘దిశ’ లో ‘రోగం వస్తే సిటీకి.. లేకుంటే కాటికి’ అనే శీర్షిక ప్రచురించడంతో బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ వెంటనే స్పందించారు.

జిల్లా అధికారులతో మాట్లాడి దన్నుర్ లో డాక్టర్ నవీన్ రెడ్డి తో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మలేరియా డాక్టర్ రవీందర్, సూపర్ వైజర్ స్వామి, సిబ్బంది పసుల చంటి, సర్పంచ్ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story