- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చలికాలంలో జలుబు, కఫం సమస్యలతో బాధపడుతున్నారా.. ఇలా చేయండి
దిశ, వెబ్‌డెస్క్ : చలికాలం వచ్చిందంటే చాలు అనేక ఆరోగ్య సమస్యలు చుట్టు ముడుతుంటాయి. ఇక ఈ కాలంలో చాలా మంది దగ్గు, జలుబు, తల నొప్పితో బాధ పడుతూ ఉంటారు. అయితే ఇలాంటి అనారోగ్య సమస్యల నుంచి బయట పడటానికి చక్కటి చిట్కా చూద్దాం. వాము అందరికి తెలిసిందే. చూపుకు చిన్నగా ఉన్నా దీని ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇక జలుబు, దగ్గు, కఫంకు ఇది మంచి ఔషదంలా పనిచేస్తుంది. శీతాకాలంలో చాలామంది దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతుంటారు. ఎన్ని ట్యాబ్‌లేట్స్ వాడినా జలుబు, దగ్గు తగ్గదు అలాంటి వారు ఈ చిట్కాను ఫాలో అయితే చిటికలో జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఇంతకీ ఏంటి ఆ చిట్కా అనుకుంటున్నారా.. ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని పోసి అందులో ఒక టేబుల్ స్పూన్ వాము, 10 పుదీనా ఆకులు, రెండు కర్పూరం బిళ్ళలు వేసి ఆ నీటిని బాగా మరిగించాలి. ఈ నీరు బాగా మరుగుతున్నప్పుడు పొయ్యి మీద నుంచి దించాలి, ఆ తర్వాత ఆవిరిని కొంతసేపు ముక్కుతో, కొంతసేపు నోటితో పీల్చడం వల్ల శ్వాస నాళాలు శుభ్రపడి ఊపిరితిత్తుల్లో కఫం బయటకు త్వరగా వచ్చేస్తుంది. జలుబు, మైగ్రెయిన్ తలనొప్పికి ఈ వాము మంచి మందు. వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తే సమస్య తీరిపోతుంది. అస్తమా వ్యాధిగ్రస్తులు వాము, బెల్లం కలిపి తీసుకుంటే మంచిది. గుండెవ్యాధులు రాకుండా నివారించడంలో వాము ముఖ్య పాత్ర పోషిస్తోంది.