వజ్రాసనంతో అజీర్తికి చెక్..

by sudharani |   ( Updated:2021-06-23 06:18:27.0  )
వజ్రాసనంతో అజీర్తికి చెక్..
X

తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, మలబద్ధకం, పుల్లటి తేన్పులు, మొలలు, హెర్నియా వంటి సమస్యలతో బాధపడేవారు వజ్రాసనాన్ని రోజువారీ అలావాటులో చేర్చుకుంటే చాలావరకు ఉపశమనం పొందవచ్చు.

వజ్రాసనం ఎలా వేయాలంటే..

ముందుగా సుఖాసనంలో కూర్చోవాలి. అనంతరం రెండు కాళ్లను ఒకదాని తర్వాత మరొకటి మోకాళ్ల దగ్గర వంచుతూ, పాదాలను పిరుదుల కిందకు తీసుకోవాలి. మడమలను ఎడంగా పెట్టి.. బొటనవేళ్లు ఒకదానితో ఒకటి తాకేలా చూసుకోవాలి. తల, వెన్నెముక నిటారుగా ఉంచి, అరచేతులను మోకాళ్లపై ఆనించాలి. అనంతరం కళ్లు మూసుకుని వీలైనంత నెమ్మదిగా, శ్వాస తీసుకుంటూ వదిలేయాలి. ఇలా ఓ 10-15నిమిషాలు చేసి, తిరిగి మాములు స్థితికి రావాలి. అయితే, మోకాళ్ల నొప్పులు తీవ్రంగా ఉన్నవారు వజ్రాసనానికి దూరంగా ఉండటం మంచిది.

టెన్షన్ పడుతున్నారా.. ఇలా చేస్తే టెన్షన్ చిటికెలో మాయం -Bhramari Pranayama

Next Story

Most Viewed