ఉలవలతో ఆరోగ్య ప్రయోజనాలు

by sudharani |
ఉలవలతో ఆరోగ్య ప్రయోజనాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉలవలు ఆరోగ్యానికి చాలా మంచిది. నవ ధాన్యాల్లో ఒకటైన ఉలవల్ని ఏ రూపంలో ఆహారంగా తీసుకున్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక ఉలవలు అంటే మన తెలుగువారికి చాలా ఇష్టం. వీటితో కాచుకునే చారు రుచి ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ తింటారు.

ఉలవల్లో ఫైబర్, ఐరన్‌, కాల్షియం, పాస్ఫరస్‌ అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చక్కని పోషణను అందిస్తాయి. వీటిలో ఫైబర్ ఉండడంతో రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు, రక్తపోటు నియంత్రణలో ఉంటాయి. అలానే ఉలవల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఎదిగే పిల్లలకి కూడా వీటిని పెడితే మంచిది.

ఉల‌వలను క‌షాయం రూపంలో చేసుకుని తీసుకుంటే స్త్రీల‌కు రుతు స‌మ‌యంలో క‌లిగే స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. దీనిలో ఉండే ఫైబర్ వల్ల మలబద్ధకం రాకుండా అడ్డుకుంటుంది. ఉల‌వ‌ల‌ను రెగ్యుల‌ర్‌గా తీసుకోవడం ద్వారా శ‌రీరంలో ఉన్న కొవ్వు క‌రిగి అధిక బ‌రువు త‌గ్గుతారు. ఉలవల్లో ఆక‌లిని పెంచే గుణాలు ఉంటాయి. మూత్ర పిండాలు, మూత్రాశ‌యంలో ఏర్ప‌డే రాళ్లు క‌రిగిపోతాయి. మ‌ల‌మూత్ర విసర్జ‌న‌లు సాఫీగా అవుతాయి. ఉలవలు ఆకలిని పెంచుతాయి. కఫాన్ని పల్చగా మార్చి బయటకు తెస్తాయి. కళ్లు కన్నీరు కారటం, కళ్లల్లో పుసులు కట్టడం వంటి సమస్యలకు ఉలవలతో చేసిన ఆహారం నివారిస్తుంది.

Advertisement

Next Story