- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లవంగం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు
దిశ, వెబ్‌డెస్క్: సుగంధ ద్రవ్యాల్లో లవంగాలు ఒకటి. లవంగాల్ని వంటల్లో, మాంసం కూరల్లో, బిర్యానీ తయారీలో ఉపయోగిస్తుంటాం. ఇవి వంటకాలకు టేస్ట్ అందించడంతో పాటు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. లవంగాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. విటమిన్ సి, కె, ఈ మెగ్నిషీయం, కాల్షియం, మాంగనీస్, ఫైబర్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరు సక్రమంగా నిర్వహించడంలో తోడ్పడుతుంది. వీటిలో ఉండే విటమిన్-సి రోగనిరోధక వ్యవస్ధను పెంచుతుంది. ఈ లవంగాలలో ‘యూజెనాల్’ అని పిలువబడే సమ్మేళనమును కలిగి ఉంటాయి. ఇది శరీర కణాలను నష్టపరిచే రాడికల్స్‌ను అడ్డుకుంటుంది.
పంటినొప్పితో బాధపడేవారు లవంగం ముక్కలను నమలడం వల్ల ఎంతో ఉపశమనం కలుగుతుంది. చర్మంపై ఏర్పడే మంటలకు లేదా కాలిన గాయాలకు లవంగాల పేస్ట్ ఉపయోగపడుతుంది. ఆయుర్వేదిక్ ఔషధశాస్త్ర ప్రకారం.. లవంగాల పేస్టులో యాంటీ-ఫంగల్ & యాంటీ-గ్రిమిసిడల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది బ్యాక్టీరియాను చంపి, గాయం నుంచి ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. ఇక లవంగ నూనెను వాడడం వల్ల జీర్ణాశయంలో గ్యాస్ట్రిక్ శ్లేష్మ ఉత్పత్తిని పెంచుతుంది.
లవంగాలు తిమ్మిర్లు, అలసట, అతిసారమును వంటి రుగ్మతలను కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రిస్తుంది. ఇవి కాలేయం పనితీరును మెరుగుపరచడమే కాకుండా, కాలేయ ఆరోగ్య పోషణకు అనుంబంధంగా ఉండే మంచి కొవ్వును అందిస్తుంది. లవంగాలు రక్తంలో గల చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. ఇక వీటిలో ఉండే యూజెనాల్ అనే సమ్మేళనం ఎముకలు గట్టిపడేలా చేస్థాయి. దీంతో ఎముకలలో ఏర్పడే పగుళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు లవంగం నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది.