- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లికాని అమ్మాయిల ఊహలకు గోరింటాకు అందాలు..
దిశ, వెబ్‌డెస్క్ : ఇంటికి అందం ఆడపిల్ల.. ఆ ఆడపిల్ల చేతికి అందం గోరింటాకు. గోరింటాకు అంటే ఇష్టపడని అమ్మాయి ఉండదు. ఏ చిన్న కార్యక్రమం జరిగినా ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకుంటారు. ఆషాడం వచ్చిందటే చాలు అతివల చేతుల్లో అలంకరణగా మారి ప్రత్యేక ఆకర్షణ ఇస్తుంది ఈ గోరింటాకు. అంతే కాకుండా మగువ అందాన్ని పెంచడంలోనూ, ఆరోగ్యాన్నివ్వడంలోనూ గోరింటాకు ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పాలి. అంతే కాదండోయ్.. పెళ్లి కాని అమ్మాయిల ఊహలకు గోరింటాకు అందాలను అద్దడానికి వచ్చినట్లు ఉంటుంది ఆషాడం. గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త వస్తాడు అంటారు పెద్దలు. ఆషాడంలో కొత్త పెళ్లి కూతుర్లు పుట్టింటికి వస్తారు. వారు ఆషాడ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే తమ చేతులను పండించుకునే గోరింటాకు, వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. పుట్టింట ఉన్న మనసు, మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది అంటారు. అందుకే ఆషాడంలో అమ్మాయిల ఊహాలు అరిచేతిలో గోరింటాకులా మెరిసిపోతుంటాయి.
ఆషాడంలో మహిళలు గోరింటాకు పెట్టు కోవడం వెనుక అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆషాడంలో గోరింటాకు పెట్టుకోవడం మన ఆనవాయితీ, సంస్కృతి. అయితే ఈ గోరింటాకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అంటున్నారు నిపుణులు. జ్యేష్ఠ మాసంలో వర్షాలు కురవడం మొదలైన ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. ఈ వర్షంలో తడవడం వలన చర్మవ్యాధులు రావడం గోళ్లు దెబ్బతినడం సహజం. వీటి నుంచి రక్షణ పొందడానికి గోరింటాకు ఉపయోగ పడుతోంది. ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫసంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకుకు ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది. అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాలబారిన పడకుండా చేస్తుంది గోరింటాకు.
మరిన్ని ప్రయోజనాలు..
-
జుట్టుకి సహజరంగును ఇచ్చి కాంతి పెంచడంలో గోరింటాకు ప్రధాన పాత్ర పోసిస్తుంది
-
అరికాళ్లకు గోరింటాకు పెట్టుకుంటే శరీరంలో వేడిని, అరికాళ్ల మంటను తగ్గిస్తోంది.
-
గోరింటాకు చెట్టు వేళ్లు వేడి నీటిలో వేసి స్నానం చేస్తే చర్మవ్యాధులు రావు
-
గోరింటాకు చెట్టు బెరడను కాల్చి ఆ బూడిదతో పళ్ళు తోముకుంటే పళ్ళకు, చిగుళ్ళకు ఎంతో మేలు.