కలబంద వల్ల కలిగే ప్రయోజనాలు

by sudharani |   ( Updated:2021-02-10 00:20:21.0  )
కలబంద వల్ల కలిగే ప్రయోజనాలు
X

దిశ, వెబ్‌డెస్క్: మనకు ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే వాటిలో కలబంద ఒకటి. ఇది ఆరోగ్యానికి పోషకాలను అందించడం మాత్రమే కాకుండా చర్మ సంరక్షణకు ఎంతో ఉపయోగపడుతుంది. కలబందతో జెల్స్, క్రీమ్స్, జ్యూస్‌లు తయారుచేసుకోవచ్చు. కలబంద వల్ల కలిగే ప్రయోజాలెంటో తెలుసుకుందాం..

కలబందలో విటమిన్స్, ఖనిజాలతో పాటు యాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇది శరీరంలోని కొవ్వు, బరువు తగ్గడంలో ఎంతగానో సహయపడుతుంది. అలాగే జీవక్రియను పెంచడానికి తోడ్పుడుతుంది. కలబంద వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేసి డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలను దూరం చేస్తుంది. అలాగే కలబందను ఆహారంలో చేర్చడం ద్వారా ఊబకాయం తగ్గించేందుకు సహయపడుతుంది. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. కలబంద పాలలో ఆంత్రాక్వినోన్ గ్లైకోసైడ్లను కలిగి ఉండడం వల్ల విరేచనాలను తగ్గిస్తుంది.

కలబండ ఆహరంలో భాగంగా తీసుకోవడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ స్థాయిలపై ప్రభావం చూపుతుంది. ఇది జ్ఞాపక శక్తిని పెంపొందించి మెదడును చురుకుగా పనిచేసేలా చేస్తుంది. కలబందలోని ఉన్న అనేక అమైనో ఆమ్లాలలో ఆర్జినైన్ ఒకటి. ఇది గుండె జబ్బులను దూరం చేస్తుంది. ఇక దురద, మంటలను తగ్గించడంలో అలోవెరా జెల్ ఎంతగానో పనిచేస్తుంది. కీళ్లనొప్పులకు, మోకాళ్ల నొప్పుల చికిత్సలో కలబంద వాడడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. కలబంద చిగుళ్ళలో రక్తస్రావం మరియు వాపును తగ్గిస్తుంది. కలబంద గుజ్జు దగ్గు, జలుబు, మరియు గొంతు నొప్పులను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది.

కలబంద చర్మ ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. కలబందలో గ్లిసరిన్, సోడియం పామాల్, సోడియం కార్బోనేట్, సోడియం పామ్ కెమేలేట్, సార్బిటోల్ మొదలైనవి వంటి పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కలబంద, ఆలివ్ నూనెతో తయారు చేసిన తేమ ప్యాక్ చర్మంపై ముడతలను తగ్గిస్తుంది. కలబంద గుజ్జు చర్మంపై జిడ్డు, మొటిమలను తగ్గిస్తుంది. చర్మంపై మచ్చలను తొలగించాలంటే అలోవెరా జెల్‌లో రోజ్‌ వాటర్‌ కలిపి ముఖంపై అప్లయి చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.

చెరకు రసం వల్ల ప్రయోజనాలు

Advertisement

Next Story