- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దివ్యాంగుల వర్చువల్ డ్యాన్స్ షో..
దిశ, వెబ్‌డెస్క్: జీవితం.. ఒక ప్రయాణం. చీకటి వెలుగు.. గెలుపు ఓటమి.. మంచి చెడు.. కష్టం సుఖం.. సంతోషం దు:ఖంల కలయిక. ఇది సాధారణ మానవుల విషయంలో జరుగుతుంది. కానీ దివ్యాంగుల విషయానికొస్తే.. వారి ఎప్పుడూ ఓటమే అన్నట్లుగా సాగుతుంది. లోపంతో పుట్టిన వారంతా జీవితాంతం ఏదో ఒక లోపంతోనే గడపాల్సి వస్తుంది. కానీ దేవుడిచ్చిన అలాంటి లోపాన్ని కూడా అధిగమిస్తూ.. సంతోషంగా ఉండాలని చెప్పే ప్రయత్నం చేస్తోంది ‘యువర్ లైఫ్. కో. ఇన్’. దివ్యాంగుల స్టోరీస్ ద్వారా మనలో స్ఫూర్తి నింపే ప్రయత్నంలో వర్చువల్ డాన్స్ షోను మన ముందుకు తీసుకొస్తోంది.
ఉపాసన కామినేని కొణిదెల.. పాజిటివ్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్. ఎప్పుడూ పాజిటివ్ విషయాల గురించి వివరిస్తూ మెంటల్‌గా, ఫిజికల్‌గా హెల్దీగా ఉండాలని సలహా ఇస్తుంది. అందుకోసం ఏం చేయాలనే దానిపై తరుచుగా సూచనలు కూడా ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే యువర్ లైఫ్.కో.ఇన్(Urlife.co.in) ద్వారా పలువురు సెలెబ్రిటీలతో కలిసి జీవితాన్ని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి? మనసుకు ప్రశాంతత ఎలా దొరుకుతుంది? ఎలాంటి నెగెటివ్ షేడ్స్ అండ్ థాట్స్ లేకుండా లైఫ్‌ను లీడ్ చేయాలంటే ఏం చేయాలి? అనే విషయాల గురించి వివరిస్తోంది. ఈ క్రమంలోనే #healurlifethroughdance(డ్యాన్స్ ద్వారా మీ జీవితాన్ని నయం చేసుకోండి) అనే డిజిటల్ టాలెంట్ షోకు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం దివ్యాంగులైన సోదరసోదరీమణుల కోసం మాత్రమే తీర్చిదిద్దబడిన ఆన్‌లైన్ టాలెంట్ షో కాగా.. కరోనా లాంటి క్లిష్టపరిస్థితుల్లో వారి జీవితకథలు మనల్ని ఇన్‌స్పైర్ చేయనున్నాయి. అక్టోబర్ 15లోగా ఈ కాంటెస్ట్ కోసం ఎంట్రీస్ ఆహ్వానిస్తుండగా.. ఈ వర్చువల్ షోను ప్రమోట్ చేస్తూ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు కొరియోగ్రాఫర్స్ ప్రభుదేవా, ఫరాఖాన్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్.
డ్యాన్స్ అనేది ఒక మ్యాజిక్.. లైఫ్‌ను హీల్ చేసే అద్భుతం. డ్యాన్స్ అనేది పాషన్ మాత్రమే కాదు.. ఇది ఒక ఎమోషన్. డ్యాన్స్ అనేది చాలా మంది దివ్యాంగులను అనేక కష్టాలు అధిగమించేలా చేసిందని.. వారు పంపిన వీడియోస్ తనలో స్ఫూర్తి నింపాయిని తెలిపారు చరణ్. డ్యాన్స్ నా హృదయానికి చాలా దగ్గరైందని.. దివ్యాంగ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ పంపిన డ్యాన్స్ వీడియోస్ వారిలో ఉన్న సూపర్ టాలెంట్‌ను పరిచయం చేశాయని చెప్పాడు. ఈ వీడియోస్ ద్వారా చిన్న చిన్న చాలెంజెస్‌ను ఎలా ఓవర్‌కమ్ చేయాలో నేర్చుకున్నానని చెప్పారు. మీరు కూడా ఆ వీడియోస్ చూసి వారిని ప్రోత్సహిస్తారని.. #healurlifethroughdance షోను విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాని తెలిపాడు.
లైఫ్ జర్నీలో పడిపోయి కేవలం జాబ్‌కే ఇంపార్టెన్స్ ఇస్తూ.. మనకు మెంటల్ స్ట్రెస్ బస్టర్స్‌లా మారే, మనకు హ్యాపీనెస్‌ను పంచే హాబీస్‌ను మరిచిపోతున్నామని.. వాటి మీద కూడా కాన్సంట్రెట్ చేసి లైఫ్‌ను హ్యాపీగా లీడ్ చేద్దామని సూచిస్తోంది యువర్ లైఫ్ సంస్థ. డ్యాన్స్ ద్వారా మన జీవితాలను నయం చేసుకోవచ్చని రిమైండ్ చేస్తూ #healurlifethroughdance షో చేపడుతున్నట్లు తెలిపింది.