- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిద్దార్థ్ కౌశల్ పై సంచలన ఆరోపణలు
దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆఫీసు వద్ద హెడ్ కానీస్టేబుల్ సుబ్బారావు ఆందోళనకు దిగారు. ఎస్పీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండడంతో పోలీసులు అడ్డుకున్నారు. 40 మంది పోలీసులను బదిలీలు చేయడం పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ… జిల్లా ఎస్పీ సిద్దార్ధ కౌశల్ పై తిరుగుబాటు చేశారు.
అవినీతికి పాల్పడ్డారంటూ బదిలీలు చేయడం కంటే తాము చేసిన తప్పులు నిరూపించి సస్పెండ్ చేయాల్సింది అంటూ మండిపడ్డారు. ఎస్పీ స్థాయి అధికారి మీడియాలో తమపై అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ దిగజారి ప్రచారం చేశారు. దీంతో మా కుటుంబాల పరువుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు సుబ్బారావు.
కరోనా రిసెప్షన్ పేరుతో ప్రతి పోలీసు స్టేషన్లో భవనాలు కట్టాలంటు హుకుం జారీ చేశారు. ఎస్పీ ఆ నిధులు దారిమళ్లించారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. క్రింది స్థాయి సిబ్బంది అయిన మేము ప్రజలు వద్ద అప్పులు చేసి ఇచ్చాం అన్నారు.
కాగా ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ కి జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ట్రైనీ ఐపీఎస్ అధికారిని మఫ్టీలో పోలీస్ స్టేషన్ కి పంపించి స్టేషన్ స్టాఫ్ పని తీరు పరిశీలించడం దేశవ్యాప్తంగా చర్చించుకున్నారు. మహిళల భద్రత కోసం ప్రకాశం జిల్లాలో అభయ్ డ్రాప్ హోం సర్వీస్ పేరుతో ఆయన చేపట్టిన కార్యక్రమం ప్రశంసలను పొందుతోంది.
సిన్సియర్ పోలీస్ బాస్ గా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ కు మంచి పేరుంది. అటువంటి ఆఫీసర్ పై నిధులు మళ్ళించారంటూ హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు చేసిన ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.