- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తనకు 30 ఏళ్ల అనుభవం ఉంది.. కోర్టుకు తెలిపిన ఆర్జీవీ
దిశ, వెబ్‌డెస్క్: వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ యదార్థ కథాంశంతో తెరకెక్కిస్తున్న ‘మర్డర్’ మూవీ విడుదల మరోమారు వాయిదా పడింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన అమృత, ప్రణయ్ ల ప్రేమ, మర్డర్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం జరగడంతో దీనిపై అమృత నల్గొండ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన ఎస్సీ, ఎస్టీ కో్ర్టుకు రాంగోపాల్ వర్మ కౌంటర్ దాఖలు చేశారు.
తాను 30 ఏళ్లుగా చిత్రాలు నిర్మిస్తున్నానని, తాను ఎవరినీ కించపరిచేలా సినిమాలు తీయలేదని కోర్టుకు అందజేసిన కౌంటర్ లో పేర్కొన్నారు. సినీ పరిశ్రమతో మూడు దశాబ్దాల సుధీర్ఘ అనుభవం ఉన్నదని, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా సినిమాలను తీస్తున్నాని ఆర్జీవీ అఫిడవిట్ ని అడ్వకేట్ కోర్టుకు దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను ఈ నెల 19కి కోర్టు వాయిదా వేసింది.
మర్డర్ సినిమాలో తన పేరు, ఫొటోలు వాడుకున్నారంటూ గత నెల 29న ఆ సినిమా దర్శక, నిర్మాతలపై అమృత నల్లగొండ కోర్టులో సూట్ ఫైల్ చేశారు. ఇప్పటికే భర్త ప్రణయ్ హత్యతో రెండేళ్లుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నానని, కల్పిత స్టోరీలతో సినిమా చిత్రీకరించి తమ జీవితాలతో ఆటలాడుకోవడం సరికాదని పిటిషన్‌లో పేర్కొన్నారు.ఈనెల 6న మొదట విచారణ ప్రారంభించి 11 కు వాయిదా వేసింది. తన క్లయింట్ రామ్ గోపాల్ వర్మకు కరోనా వైరస్ సోకినందున ఇప్పటికే రెడీ చేసిన జవాబు పిటిషన్ పై సంతకం చేయనందున అడ్వోకేట్ గడువు కోరడంతో 14కు వాయిదా వేశారు. దీనిపై నేడు విచారణ జరిపిన కోర్డు తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.