- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిట్టీల పేరుతో కుచ్చుటోపీ..రూ.7 కోట్లతో చెక్కేసిన కేటుగాడు
దిశ, ఏపీ బ్యూరో: పశ్చిమ గోదావరి జిల్లాలో ఘరానా మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. చిట్టీల పేరుతో ఓ వ్యక్తి నిట్టనిలువునా ముంచేశాడు. ఏకంగా రూ. 7 కోట్లకు ఎగనామం పెట్టి పరారయ్యాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళితే..జిల్లాలోని నిడదవోలు మండలం అట్లపాడు గ్రామానికి చెందిన తిరుమల రంజిత్ కుమార్ గత కొన్నేళ్లుగా ఫైనాన్స్, చిట్టీల పేరుతో వ్యాపారం చేసేవాడు. అందరితో చాలా గౌరవంగా నటిస్తూ ఉండేవాడు. అతడి ప్రవర్తనను నమ్మి స్థానికంగా ఉండే ప్రజలు భారీగానే చిట్టీలు వేశారు.
అయితే గత కొన్ని రోజులుగా రంజిత్ ఫోన్ నెంబర్ స్విచ్ఛాఫ్ రావడంతో చిట్టీలు వేసిన వారంతా ఆందోళనకు గురయ్యారు. దీంతో అతడు ఉండే ఇంటికి వెళ్లి చూడగా తాళాలు వేసి ఉన్నాయి. దీంతో తాము మోసపోయామని భావించిన చిట్టీ దారులు సమిశ్రగూడెం పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు. రంజిత్‌పై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే విచారణలో రూ.7కోట్లకు ఎగనామం పెట్టి పరారైనట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్ఐ షేక్ సుభాని తెలిపారు.