ఆయన బిక్షతోనే కేసీఆర్ సీఎం అయ్యారు..

by Shyam |
ఆయన బిక్షతోనే కేసీఆర్ సీఎం అయ్యారు..
X

దిశ, తెలంగాణ బ్యూరో : జానారెడ్డి పెట్టిన బిక్షతో కేసీఆర్ సీఎం అయ్యారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. నాగార్జున సాగర్లో‌ జరగునున్న ఎన్నికల నేపథ్యంలో గాంధీ భవన్లో‌ కాంగ్రెస్ నాయకులు బుధవారం మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ముఖ్య కారణం జానారెడ్డి అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం జానారెడ్డికి సీఎం పదవి ఇస్తామన్నా తీసుకోకుండా తెలంగాణ కోసం త్యాగం చేశారన్నారు. ఆ రోజు జానారెడ్డి సీఎం అయి వుంటే కేసీఆర్ సీఎం అయ్యేవారా అని ప్రశ్నించారు. సాగర్ బై ఎలక్షన్ లో గెలిచేందుకు రూ.100 కోట్లైనా ఖర్చు చేయమని అక్కడి నాయకులకు సీఎం ఆదేశించారన్నారు. మంగళవారం ఆరు మండలాల నాయకులకు కేసీఆర్ ఫాం హౌస్ లో రూ. 5కోట్ల చొప్పున అప్పజెప్పారన్నారు. జానారెడ్డిపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అనంతరం టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి మాట్లాడుతూ.. రాజకీయాలకు దిక్సూచి లాంటి జానా రెడ్డిని సాగర్ లో యునానిమస్ గా గెలిపించి ఆయన్ని గౌరవించాలన్నారు. కేసీఆర్ రాజకీయ పతనం దుబ్బాక నుంచే ప్రారంభమైందని, సాగర్ లోనూ ఓడిపోవడం ఖాయం అన్నారు. పదివేల కోట్ల స్కాం జరిగిందని కాగ్ చెప్పినందున కేంద్ర జోక్యం చేసుకొని వెంటనే ఎంక్వైరీ చేసి ఏ శాఖలో స్కాం జరిగిందో గుర్తించాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రెవెన్యూ పేరుతో ఏడేళ్లలో నాలుగు లక్షల కోట్ల అప్పలు చేశారన్నారు.

Advertisement

Next Story