- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఐపీపీబీతో భాగస్వామ్యం కుదుర్చుకున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో తన బ్యాంకింగ్ సేవలను అందించేందుకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఐపీపీబీకి 4.7 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. వారిలో దాదాపు 90 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరందరికీ బ్యాంకింగ్ సేవలను విస్తరించేందుకు ఈ ఒప్పందం ఎంతో దోహదపడుతుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ భావిస్తోంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చేపడుతున్న డొర్‌స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్ ద్వారా ఐపీపీబీ వినియోగదారులకు ఫైనాన్స్ సదుపాయల సరసమైన, ఇతర ఆఫర్ల ద్వారా అందిస్తూ, వారికి ప్రయోజనాలు చేకూర్చేందుకు వీలవుతుందని వివరించింది. మైక్రో ఏటీఎం లు, బయోమెట్రిక్ పరికరాలతో కూడా సుమారు 2 లక్షల పోస్టల్ సర్వీస్ ప్రైవేడర్ల(పోస్ట్మెన్, గ్రామీణ డాక్‌సేవ)తో ఐపీపీబీ వివిధ రకాలా అవసరాలను తీరుస్తోంది. ఈ భాగస్వామ్యం ద్వారా ఐపీపీబీకి ఉన్న 650 బ్రాంచులు, దేశవ్యాప్తంగా ఉన్న 1.36 లక్షల బ్యాంకింగ్ యాక్సెస్ పాయింట్లతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విస్తరణ ద్వారా వివిధ బ్యాంకింగ్ సేవలందించేందుకు, కస్టమర్ల ఇంటి వద్దకే బ్యాంకింగ్ సౌకర్యాలు అందించాలని లక్ష్యంగా ఉన్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కంట్రీ హెడ్ స్మితా భగత్ సోమవారం ఓ ప్రకటనలో అన్నారు. ‘ భాగస్వాముల ద్వారా డిజిటల్ టెక్నాలజీ, ప్రత్యామ్నాయ డేటా వనరులతో ఇంటి వద్దకే క్రెడిట్ సౌకర్యం సహా వివిధ సేవలను అందించే ఓ ప్లాట్‌ఫామ్ అందించడమే తమ ప్రయత్నమని ఐపీపీబీ సీఈఓ జె వెంకట్రావు అన్నారు.