హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఈజీగా రూ.10 లక్షల రుణం

by Anukaran |   ( Updated:2021-07-29 00:08:34.0  )
హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఈజీగా  రూ.10 లక్షల రుణం
X

దిశ, వెబ్‌డెస్క్ : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమ ఖాతాదారులకు తీపి కబురు అందించింది. ఇప్పటికే తక్కువ వడ్డీకి పర్సనల్ లోన్స్ అందిస్తోంది. ఇక ఈ బ్యాంకు ద్వారా కస్టమర్స్ ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు. బ్యాంక్ తాజాగా ప్రభుత్వానికి చెందిన ఇగవర్నెన్స్ సర్వీసెస్ డెలివరీ విభాగం సీఎస్‌సీ ఎస్‌పీవీ‌తో జత కట్టింది. దీని వలన సులభంగా రుణాలు పొందవచ్చు. దీనిలో భాగంగానే ఇగవర్నెన్స్ సర్వీసెస్ డెలివరీ విభాగం తో కలిపి చిరు వర్తకులకు సులభంగానే రుణాలు అందిస్తోంది. అందుకే ఓవర్‌ డ్రాఫ్ట్ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకు వచ్చింది.

ఈ క్రమంలోనే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దుకాణ్‌దార్ ఓవర్‌ డ్రాఫ్ట్ స్కీమ్‌తో ఇప్పుడు దుకాణదారులు, వ్యాపారుల ఆర్థిక ఇబ్బందులను తొలిగించడానికి రుణాలను అందిస్తోంది. ఈ రుణాల ద్వారా బ్యాంకు కస్టమర్స్‌కు మంచి ప్రయోజనం ఉంటుంది. అయితే బ్యాంక్ ప్రకారం కనీసం మూడు సంవత్సరాలు పనిచేసే చిల్లర వ్యాపారులు ఏ బ్యాంకు నుంచి అయినా ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

పథకం వివరాలు..

వ్యాపారస్థుడు ఈ పథకం ద్వారా రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణం పొందొచ్చు. ఈ తరహా ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కోసం ఎలాంటి తనఖా పెట్టాల్సిన అవసరం ఉండదు. ఐటీఆర్, బ్యాంక్ స్టేట్‌మెంట్ ఇస్తే సరిపోతుంది. దుకాణదారుడు ఇచ్చే స్టేట్మెంట్ కనీసం 15 నెలలు బ్యాంకు కస్టమర్ అయి ఉండాలి. అలాగే కనీసం 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ కలిగి ఉండాలి. దుకాణం పెట్టి ఆరేళ్లలోపు అయ్యి ఉంటే రూ.7.5 లక్షల వరకు రుణం పొందొచ్చు. అదే 6 ఏళ్లు దాటితే రూ.10 లక్షల వరకు వస్తుంది. చిన్న వ్యాపారుల ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త పథకాన్ని రూపొందించినట్లు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తెలిపింది. ఈ పథకం కింద దుకాణం లేదా చిన్న వ్యాపారస్తులు మాత్రమే ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందగలరు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే లోన్ తీసుకుని ఆర్థిక సమస్యలకు చెక్ పెట్టండి.

For more updates Join Dishadaily on Telegram : https://t.me/dishatelugu

Advertisement

Next Story

Most Viewed