కాంగ్రెస్‌ను ప్రశ్నించిన హాథ్రాస్ ప్రజలు

by Shamantha N |
కాంగ్రెస్‌ను ప్రశ్నించిన హాథ్రాస్ ప్రజలు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున నిరసనలు చేయడమే కాకుండా, బాధిత ఫ్యామిలీని రాహుల్, ప్రియాంక గాంధీలు పరామర్శించారు. అయితే, తాజాగా కాంగ్రెస్ పార్టీ మునుపెన్నడూ ఎదుర్కొని పరిస్థితి హాథ్రాస్ గ్రామస్థుల నుంచి ఎదురైంది.

హాథ్రాస్ ఘటనపై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్ నేతలు.. రాజస్థాన్‌లో పూజారిని సజీవ దహనం చేసిన విషయంపై ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. అలాగే ర్యాలీలు ఎందుకు తీయడం లేదని ఓ జాతీయ పార్టీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నలు గుప్పించారు. కాగా, రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.

Advertisement

Next Story

Most Viewed