ఇల్లీగల్ ఎఫైర్ : మర్డర్ కేసులో నిందితురాలిగా తాప్సీ..

by Jakkula Samataha |   ( Updated:2021-06-11 03:20:56.0  )
tapsee new movie
X

దిశ, సినిమా : తాప్సీ పన్ను మరో హిట్ ఖాతాలో వేసుకునేలా కనిపిస్తోంది. తన లేటెస్ట్ ఫిల్మ్ ‘హసీన్ దిల్‌‌రుబా’ ద్వారా మరోసారి ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేసేందుకు సిద్ధమవుతోంది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా జులై 2న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుండగా.. తాజాగా విడుదలైన ట్రైలర్ సూపర్బ్ రెస్పాన్స్ అందుకుంటోంది. ప్రముఖ రచయిత దినేష్ పండిట్ పుస్తకాలను చదివే ఓ అమ్మాయి కథే ‘హసీన్ దిల్‌రుబా’ కాగా.. చిన్న చిన్న పట్టణాల్లో ‘స్పైన్ చిల్లింగ్ మర్డర్స్‌’ గురించిన ఆయన రచనలు తాప్సీని ఎలా ప్రభావితం చేశాయి? డ్యాషింగ్, నాటీ, పాషనేట్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కలిగిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయి.. చివరకు అలాంటి క్వాలిటీస్ లేని వ్యక్తితో పెళ్లికి ఎందుకు కాంప్రమైజ్ అయింది? ఆ తర్వాత మరో వ్యక్తితో ఎక్స్‌ట్రా మారిటల్ రిలేషన్‌షిప్ పెట్టుకున్న తను.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసిందా? లేక భర్తే తన లవర్‌ను హతమార్చాడా? అనే విషయంపై ఆసక్తి రేకెత్తించడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.

‘ప్రతీ కథకు విభిన్న దృక్కోణాలు ఉంటాయి.. చెప్పే వ్యక్తిని బట్టి అవి మారిపోతూ ఉంటాయి’ ఇదే లైన్‌తో ‘హసీన్ దిల్‌రుబా’ తెరకెక్కగా.. మర్డర్ కేసులో నిందితురాలిగా ఉన్న తాప్సీ చెప్పే కథేంటి? భర్త విక్రాంత్ మాసే విలనా? లేక ప్రియుడు హర్షవర్ధన్ రాణే హంతకుడా? ఎవరు ఎవరిని చంపారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ నిర్మించిన సినిమాకు కనిక థిల్లాన్ రచయిత కాగా, వినిల్ మాథ్యూ దర్శకత్వం వహించారు.

Advertisement

Next Story