త్వరలో హర్యానాలో ప్లాస్మా థెరపీ

by Shamantha N |
త్వరలో హర్యానాలో ప్లాస్మా థెరపీ
X

చండీగఢ్: పొరుగునే ఉన్న పంజాబ్, చండీగఢ్‌ రాష్ట్రాలు కరోనా పేషెంట్లకు ప్లాస్మా థెరపీ చికిత్సను ప్రారంభించిన తర్వాత హర్యానా కూడా అదే బాటలో నడిచేందుకు నిర్ణయం తీసుకుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) అనుమతి పొందిన తర్వాత రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీల్లో కరోనా పేషెంట్లకు ప్లాస్మా థెరపీని అందించనున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ ట్వీట్ చేశారు.హర్యానాలో ఇటీవలే పోస్టు గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ అండ్ రీసెర్చ్‌లో ఆరుగురు పేషెంట్లకు ప్లాస్మా థెరపీ విజయవంతమైంది. చికిత్స పొందిన పేషెంట్లు అందరూ రికవరీ అయ్యారని సమాచారం.

Advertisement

Next Story